BREAKING
భరించలేని అనారోగ్య బాధలు.. కారుణ్య మరణం పొందిన 43 ఏళ్ల ప్రముఖ నటుడు! పండుగల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు ఘనంగా మాజీ పీఎం మన్మోహన్ సింగ్ జయంతి వేడుకలు ఔటర్ రింగు రోడ్డుపై ఘోర ప్రమాదం: ఇద్దరు మృతి, 11 మందికి తీవ్ర గాయాలు నాతో అసలు పనిలేదు.. అయినాసరే ఆ పారితోషికం తిరిగిచ్చేశారు: నటి లయ ఆసక్తికర వ్యాఖ్యలు వీరనారి ఐలమ్మ పోరాటం నేటి యువతకు స్ఫూర్తిదాయకం నటుడు దర్శన్ బెయిల్ కోసం రాష్ట్రపతికి అభిమానుల లేఖ.. సోషల్ మీడియాలో వైరల్! సుమలత విభజించి పాలిస్తున్నారు.. అందుకే యూనియన్‌లో సమస్యలు: రఘు మాస్టర్ సంచలన ఆరోపణలు అనకాపల్లిలో కూటమి సమన్వయ సమావేశంలో ఎన్నికలపై సుదీర్ఘ చర్చ...... నాని ‘ది ప్యారడైజ్’ సినిమాపై ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు! గ్లోబల్ స్థాయిలో 'రామాయణం' ప్రమోషన్స్.. మిస్టర్ బీస్ట్‌తో మేకర్స్ మాస్టర్ ప్లాన్! విదేశీ ఉద్యోగం.. ఇక ప్రభుత్వ మార్గంలోనే..! నాని ‘ది ప్యారడైజ్’ మూవీపై కేటీఆర్ ఆసక్తికర పోస్ట్.. టాలీవుడ్ అంచనాలు తారాస్థాయికి! ప్రయాణికులకు మరింత చేరువగా పోలీస్ సేవలు కొత్త హెయిర్‌స్టైల్‌తో అనసూయ రచ్చ.. తగ్గేదేలే అంటున్న టాలీవుడ్ బ్యూటీ!

శనేశ్వరుడికి భక్తులు తైలాభిషేకాలు

Select Suryaa Now
శనేశ్వరుడికి భక్తులు తైలాభిషేకాలు

మండల పరిధిలోని మందపల్లి గ్రామంలో వేంచేసిన శ్రీ మందేశ్వర (శనేశ్వర) స్వామివారి దేవస్థానంలో భక్తుల సందడి నెలకొంది.శనివారం సందర్భంగా తెల్లవారుజాము నుంచే వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ఆలయానికి తరలివచ్చారు.ప్రాతఃకాల అర్చనలు,ప్రత్యేక పూజల అనంతరం భక్తులు స్వామివారికి తైలాభిషేకాలు నిర్వహించి,సర్వదర్శనం చేసుకున్నారు.ఆలయంలో భక్తుల రద్దీ పెరగడంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.ఆలయ సహాయకమిషనర్,కార్యనిర్వహణాధికారి దారపురెడ్డి సురేష్‌బాబు ఆధ్వర్యంలో భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పించారు.భక్తుల రాకపోకలు,దర్శనం, తైలాభిషేకాల నిర్వహణలో సిబ్బంది తగిన జాగ్రత్తలు తీసుకున్నారు.వివిధ సేవలు,తైలాభిషేకాల ద్వారా స్వామివారికి రూ.2,18,957 ఆదాయం సమకూరినట్లు ఈవో సురేష్‌బాబు తెలిపారు.