జక్కంపూడి రాజాను కలిసిన యువజన నేత
రాజమహేంద్రవరం, సూర్య ప్రతినిధి: తూర్పుగోదావరి జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగాన్ని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేయాలని పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సూచించారు.
పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా నూతనంగా నియమితులైన ఉర్రింకల మణికృష్ణ శనివారం రాజమహేంద్రవరంలో జక్కంపూడి రాజాను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మణికృష్ణ పుష్పగుచ్ఛం అందించి జక్కంపూడి రాజాకు కృతజ్ఞతలు తెలిపారు.
రానున్న రోజుల్లో యువజన విభాగాన్ని మరింత చురుకుగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలని జక్కంపూడి రాజా సూచించారు. పార్టీ తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ, పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేయాలని అన్నారు. నాయకులు, కార్యకర్తలతో సమన్వయం చేసుకుంటూ పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనాలని సూచించారు.
అనంతరం ఉర్రింకల మణికృష్ణను జక్కంపూడి రాజా శాలువాతో సత్కరించి అభినందించారు. కార్యక్రమంలో ఆత్రేయపురం మండల యువజన విభాగం అధ్యక్షుడు మట్టా అనిల్‌కుమార్ పాల్గొన్నారు.