BREAKING
సుమలత విభజించి పాలిస్తున్నారు.. అందుకే యూనియన్‌లో సమస్యలు: రఘు మాస్టర్ సంచలన ఆరోపణలు అనకాపల్లిలో కూటమి సమన్వయ సమావేశంలో ఎన్నికలపై సుదీర్ఘ చర్చ...... నాని ‘ది ప్యారడైజ్’ సినిమాపై ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు! గ్లోబల్ స్థాయిలో 'రామాయణం' ప్రమోషన్స్.. మిస్టర్ బీస్ట్‌తో మేకర్స్ మాస్టర్ ప్లాన్! విదేశీ ఉద్యోగం.. ఇక ప్రభుత్వ మార్గంలోనే..! నాని ‘ది ప్యారడైజ్’ మూవీపై కేటీఆర్ ఆసక్తికర పోస్ట్.. టాలీవుడ్ అంచనాలు తారాస్థాయికి! ప్రయాణికులకు మరింత చేరువగా పోలీస్ సేవలు కొత్త హెయిర్‌స్టైల్‌తో అనసూయ రచ్చ.. తగ్గేదేలే అంటున్న టాలీవుడ్ బ్యూటీ! మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎంట్రీ.. 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్' అప్‌డేట్ ఎప్పుడంటే! కీర్తి సురేశ్ 'డొరోతి' మూవీ వివాదం.. బోల్డ్ సీన్లు, ఎల్జీబీటీక్యూ కంటెంట్‌పై తీవ్ర విమర్శలు! ఉపాధ్యాయులే భావితరాలకు మార్గదర్శకులు సపల ఆర్గానిక్ సంస్థను సందర్శించిన సాందీపని డిగ్రీ కళాశాల విద్యార్థులు సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియకు వీఆర్ఏల వినతిపత్రం వీఆర్ఏల వినతి పత్రం శనేశ్వరుడికి భక్తులు తైలాభిషేకాలు జక్కంపూడి రాజాను కలిసిన యువజన నేత

రోడ్డెక్కిన వీఆర్ఏలు.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్

Select Suryaa Now
 రోడ్డెక్కిన వీఆర్ఏలు.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్

అనపర్తి మేజర్ న్యూస్ : తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ 11 రోజులుగా శాంతియుతంగా నిరసనలు కొనసాగిస్తున్న వీఆర్ఏలు శనివారం రోడ్డెక్కారు. తూర్పు గోదావరి జిల్లా  అనపర్తి, బిక్కవోలు, రంగంపేట మండలాలకు చెందిన వీఆర్ఏలు పెద్ద సంఖ్యలో అనపర్తి దేవి చౌక్‌ సెంటర్‌కు చేరుకుని మెయిన్‌రోడ్డుపై మానవహారం నిర్వహించారు. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు.

అనంతరం దేవి చౌక్‌ నుంచి పట్టణంలోని ప్రధాన వీధుల మీదుగా ర్యాలీ చేపట్టారు. నినాదాలు చేస్తూ ర్యాలీగా ముందుకు సాగిన వీఆర్ఏలు తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు.

ఈ సందర్భంగా వీఆర్ఏల సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ తాము ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేయడం లేదని, తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసమే శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. రాష్ట్ర సంఘం పిలుపు మేరకు ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా వీఆర్ఏలు ఎన్నో సంవత్సరాలుగా సేవలందిస్తున్నారని చెప్పారు. గ్రామస్థాయిలో రెవెన్యూ శాఖకు సంబంధించిన వివిధ కార్యక్రమాల అమలులో కీలక పాత్ర పోషిస్తున్న తమ సమస్యలను ప్రభుత్వం గుర్తించి పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.

గత 11 రోజులుగా శాంతియుతంగా నిరసనలు నిర్వహిస్తున్నప్పటికీ తమ సమస్యలపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన స్పందన రాకపోవడంతోనే మానవహారం, ర్యాలీ నిర్వహించాల్సి వచ్చిందని వీఆర్ఏలు తెలిపారు. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి వెంటనే అమలు చేయాలని కోరారు.

సమస్యలు పరిష్కరించే వరకు ఆందోళన కార్యక్రమాలను కొనసాగిస్తామని వీఆర్ఏల సంఘం ప్రతినిధులు స్పష్టం చేశారు.