BREAKING
జనగామ జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటణ. న్యూఢిల్లీలో ప్రధాని మోదీతో భేటీ అయిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ 17 ఏళ్ల తర్వాత భారత్-ఈయూ ఉచిత వాణిజ్య ఒప్పందం విజేతలను అభినందించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 27 ఆదివారం బ్యాంకులు పనిచేస్తాయి నగరం లో 245 పోలింగ్ స్టేషన్లో పై అభ్యంతరాల స్వీకరణ భవిష్యత్తు మహమ్మారుల నివారణకు ప్రపంచవ్యాప్త చర్యలు అవసరం సంక్షేమ అభివృద్ధి కూటమి ప్రభుత్వ లక్ష్యం స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ ప్రపోజల్‌ను తిరస్కరించిన ట్రంప్ మహారాష్ట్రలో తీవ్ర కరవు బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థిగా దొండపాటి నోటీసులు అందుకున్నవారు బీఎల్‌వోలను కలవాల్సిన అవసరం లేదు అక్టోబర్‌ 4న తెలంగాణకు అమిత్‌ షా ధర్మవరం చెరువు ఆక్రమణలను తొలగిస్తాం రాష్ట్ర మంత్రి సత్య కుమార్ యాదవ్ నాగాలాండ్‌లో కల్తీ మద్యం కలకలం.. 19 మంది మృతి

సుమలత విభజించి పాలిస్తున్నారు.. అందుకే యూనియన్‌లో సమస్యలు: రఘు మాస్టర్ సంచలన ఆరోపణలు

Select Suryaa Now
సుమలత విభజించి పాలిస్తున్నారు.. అందుకే యూనియన్‌లో సమస్యలు: రఘు మాస్టర్ సంచలన ఆరోపణలు

సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: తెలుగు సినీ డ్యాన్సర్స్ అసోసియేషన్‌లో గత కొంతకాలంగా నెలకొన్న అంతర్గత వివాదాలు రోజురోజుకూ ముదురుతున్నాయి. అసోసియేషన్ అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్న సుమలత అనుసరిస్తున్న విధానాల వల్లే యూనియన్‌లో సమస్యలు తలెత్తుతున్నాయని ప్రముఖ కొరియోగ్రాఫర్ రఘు మాస్టర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఫిల్మ్ ఛాంబర్‌లో నిర్వహించిన ప్రత్యేక మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సుమలత వ్యవహారశైలిపై పలు కీలక ఆరోపణలు గుప్పించారు. కొద్దిమంది స్వార్థపరుల ప్రయోజనాల కోసం మొత్తం వ్యవస్థను ఇబ్బందుల పాలు చేయడం సరికాదని ఆయన హితవు పలికారు.  

అసోసియేషన్‌లో వందలాది మంది డ్యాన్సర్లు ఉన్నప్పటికీ, కేవలం నలుగురు వ్యక్తుల స్వార్థం వల్ల అందరూ నష్టపోవాల్సి వస్తోందని రఘు మాస్టర్ ఆవేదన వ్యక్తం చేశారు. అధ్యక్షురాలి హోదాలో ఉన్న సుమలత అందరినీ సమానంగా చూడాల్సింది పోయి, విభజించి పాలించే కుట్రలకు తెరలేపారని ఆయన ఆరోపించారు. యూనియన్‌లో జరుగుతున్న అక్రమాలను ప్రశ్నిస్తున్న సభ్యుల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని, సమావేశాలలో మైకులు లాక్కుంటూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆయన మండిపడ్డారు.  

ఇటీవల జరిగిన జనరల్ బాడీ సమావేశంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలోనే మెజారిటీ సభ్యుల ఆమోదంతో అసోసియేషన్ కార్యవర్గాన్ని రద్దు చేసినట్లు ఆయన గుర్తుచేశారు. యూనియన్‌ను ప్రక్షాళన చేసేందుకే తాము ముందుకు వచ్చామని, ఎలాంటి బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. డ్యాన్సర్ల సంక్షేమం మరియు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అక్టోబర్ 11న జరగనున్న ఎన్నికల ద్వారా ఈ సమస్యలన్నింటికీ శాశ్వత పరిష్కారం లభిస్తుందని రఘు మాస్టర్ ధీమా వ్యక్తం చేశారు.