సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియకు వీఆర్ఏల వినతిపత్రం వీఆర్ఏల వినతి పత్రం
ఆళ్లగడ్డ మేజర్ న్యూస్
తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ విఆర్ఏలు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ కు శనివారం వినతిపత్రం సమర్పించారు. ఆళ్లగడ్డ తాసిల్దార్ కార్యాలయం నుండి ఎమ్మెల్యే అఖిలప్రియ నివాసానికి ర్యాలీగా వెళ్లి ఆమెకు వినతిపత్రం సమర్పించారు. మొదటిగా పే స్కేల్ ఇవ్వాలని, అలాగే ప్రమోషన్లు ఇవ్వక ఎనిమిది సంవత్సరాలు అవుతుందని, నామినేలుగా ఉన్న వీఆర్ఏలను పర్మినెంట్ చేయాలని తదితర డిమాండ్లను ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. వారి సమస్యలను విన్న ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ ప్రభుత్వం దృష్టికి వీఆర్ఏల సమస్యలను తీసుకెళ్తామని హామీ ఇచ్చారు.