BREAKING
సుమలత విభజించి పాలిస్తున్నారు.. అందుకే యూనియన్‌లో సమస్యలు: రఘు మాస్టర్ సంచలన ఆరోపణలు అనకాపల్లిలో కూటమి సమన్వయ సమావేశంలో ఎన్నికలపై సుదీర్ఘ చర్చ...... నాని ‘ది ప్యారడైజ్’ సినిమాపై ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు! గ్లోబల్ స్థాయిలో 'రామాయణం' ప్రమోషన్స్.. మిస్టర్ బీస్ట్‌తో మేకర్స్ మాస్టర్ ప్లాన్! విదేశీ ఉద్యోగం.. ఇక ప్రభుత్వ మార్గంలోనే..! నాని ‘ది ప్యారడైజ్’ మూవీపై కేటీఆర్ ఆసక్తికర పోస్ట్.. టాలీవుడ్ అంచనాలు తారాస్థాయికి! ప్రయాణికులకు మరింత చేరువగా పోలీస్ సేవలు కొత్త హెయిర్‌స్టైల్‌తో అనసూయ రచ్చ.. తగ్గేదేలే అంటున్న టాలీవుడ్ బ్యూటీ! మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎంట్రీ.. 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్' అప్‌డేట్ ఎప్పుడంటే! కీర్తి సురేశ్ 'డొరోతి' మూవీ వివాదం.. బోల్డ్ సీన్లు, ఎల్జీబీటీక్యూ కంటెంట్‌పై తీవ్ర విమర్శలు! ఉపాధ్యాయులే భావితరాలకు మార్గదర్శకులు సపల ఆర్గానిక్ సంస్థను సందర్శించిన సాందీపని డిగ్రీ కళాశాల విద్యార్థులు సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియకు వీఆర్ఏల వినతిపత్రం వీఆర్ఏల వినతి పత్రం శనేశ్వరుడికి భక్తులు తైలాభిషేకాలు జక్కంపూడి రాజాను కలిసిన యువజన నేత

వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తుల భారీ విరాళాలు

Select Suryaa Now
వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తుల భారీ విరాళాలు

పెరవలి మేజర్ న్యూస్ | పెరవలి: తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం అన్నవరప్పాడు గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ పునర్నిర్మాణానికి భక్తులు అండగా నిలుస్తున్నారు. ఆలయ అభివృద్ధి కోసం చేపట్టిన పనులకు తమ వంతు సహకారంగా భక్తులు పెద్ద మొత్తంలో విరాళాలు అందిస్తున్నారు.

సెప్టెంబర్ 26న శనివారం వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ పునర్నిర్మాణానికి విరాళాలు సమర్పించారు. ఖండవల్లికి చెందిన అతికాల సుబ్బారావు, సూర్యకాంతం దంపతులు రూ.1,00,116, మైపాల చంద్రరావు, సావిత్రి దంపతులు రూ.1,01,116 విరాళాలు అందించారు.

పెరవలి మండల టీడీపీ అధ్యక్షుడు అతికాల వెంకట రామకృష్ణమ్మ (శ్రీను), ప్రభావతి దంపతులు రూ.10,116, మైపాల సత్యనారాయణ, లక్ష్మి దంపతులు రూ.11,111 సమర్పించారు. గండేపల్లి మండలం మల్లేపల్లికి చెందిన కర్రి శివకృష్ణ, రామలక్ష్మి దంపతులు కుటుంబ సభ్యులతో కలిసి రూ.11,116 విరాళంగా ఇచ్చారు.

రేలంగికి చెందిన పులుపు శ్రీను, అక్కమాంబ దంపతులు, తణుకుకు చెందిన నక్కా సతీష్, దివ్య దంపతులు, పెరవలికి చెందిన దొంగా మణిరత్నం, సంధ్య దంపతులు చెరో రూ.10,116 అందించారు. పైడిపర్రుకు చెందిన పండూరి నరేష్ కుమార్, శ్రీదేవి దంపతులు, గోపాలపురానికి చెందిన ముత్యాల వీర రాఘవులు, దుర్గాభవాని దంపతులు, సోమిశెట్టి సత్తిబాబు, రమ్య దంపతులు కూడా రూ.10,116 చొప్పున విరాళాలు సమర్పించారు.

పెరవలికి చెందిన ఆండ్రాతు బాలయోగి, నాగకుమారి దంపతులు, పిట్టలవేమవరానికి చెందిన వెంకటరామారెడ్డి కుటుంబ సభ్యులు రూ.10,116 చొప్పున అందించారు. ఆర్. ఖండ్రిగకు చెందిన బందెల మల్లిఖార్జునరావు, దుర్గాభవాని దంపతులు రూ.10,116, అన్నవరప్పాడుకు చెందిన యరగం దుర్గా సత్యనారాయణ, కుసుమాంజలి లక్ష్మీ ప్రసన్న దంపతులు రూ.11,116 విరాళంగా ఇచ్చారు.

అయితంపూడికి చెందిన అందే శ్రీనివాసరావు, సరస్వతి దంపతులు గతంలో సెప్టెంబర్ 5న రూ.5,116 అందించగా, తాజాగా మరో రూ.5,000 సమర్పించారు. దీంతో వారి మొత్తం విరాళం రూ.10,116కు చేరింది. రామన్నపాలెంకు చెందిన యర్రంశెట్టి వెంకట సుబ్బారావు, సుభద్ర దంపతులు రూ.10,116, అయితంపూడికి చెందిన ఉప్పులూరి అప్పారావు, సూర్యపెద్ది లక్ష్మీకుమారి దంపతులు రూ.10,206 విరాళంగా అందించారు.

ఆలయ పునర్నిర్మాణానికి భక్తుల నుంచి లభిస్తున్న స్పందనపై ఆలయ కార్యనిర్వహణాధికారి మీసాల రాధాకృష్ణ, దేవస్థానం పాలకమండలి సభ్యులు, గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు. భక్తుల సహకారంతో పనులను వేగంగా పూర్తి చేసి, రాబోయే పుష్కరాల నాటికి ఆలయాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.