BREAKING
ముగియనున్న పసిడి రుణాల హవా పోస్టర్ల ఆవిష్కరణ ఆసియా క్రీడల్లో భారత్ ఘనవిజయం ఓటర్ల జాబితా నుంచి తొలగించిన పేర్లను పునరుద్ధరించాలి వామపక్షాలు డిమాండ్ జనగామ జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటణ. న్యూఢిల్లీలో ప్రధాని మోదీతో భేటీ అయిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ 17 ఏళ్ల తర్వాత భారత్-ఈయూ ఉచిత వాణిజ్య ఒప్పందం విజేతలను అభినందించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 27 ఆదివారం బ్యాంకులు పనిచేస్తాయి నగరం లో 245 పోలింగ్ స్టేషన్లో పై అభ్యంతరాల స్వీకరణ భవిష్యత్తు మహమ్మారుల నివారణకు ప్రపంచవ్యాప్త చర్యలు అవసరం సంక్షేమ అభివృద్ధి కూటమి ప్రభుత్వ లక్ష్యం స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ ప్రపోజల్‌ను తిరస్కరించిన ట్రంప్ మహారాష్ట్రలో తీవ్ర కరవు బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థిగా దొండపాటి

ఔటర్ రింగు రోడ్డుపై ఘోర ప్రమాదం: ఇద్దరు మృతి, 11 మందికి తీవ్ర గాయాలు

Select Suryaa Now
ఔటర్ రింగు రోడ్డుపై ఘోర ప్రమాదం: ఇద్దరు మృతి, 11 మందికి తీవ్ర గాయాలు

కూలీలతో వెళ్తున్న వాహనం టైరు పేలడంతో ఘోరం

 కీసర సమీపంలో చోటుచేసుకున్న ఘటన

మేడ్చల్ జిల్లా ప్రతినిధి(పన్నాల బాల్ రెడ్డి),మేజర్ న్యూస్ (సెప్టెంబర్ 26):ఔటర్ రింగు రోడ్డుపై శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కూలీలతో ప్రయాణిస్తున్న గూడ్స్ వాహనం వెనుక టైరు ఒక్కసారిగా పేలి బోల్తా పడటంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు.కీసర పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కీసర నుంచి శామీర్‌పేట వైపు కూలీలతో వెళ్తున్న అశోక్ లేలాండ్ గూడ్స్ వాహనం (టీఎస్ 08 యూజే 9432) ఔటర్ రింగు రోడ్డుపై ప్రయాణిస్తుండగా ఒక్కసారిగా వెనుక టైరు పేలిపోయింది. దీంతో డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోవడంతో వాహనం రోడ్డుపై బలంగా పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో వాహనంలో ఉన్న మంగీలాల్ (60), సురేఖ (40) తీవ్ర గాయాలపాలై ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద తీవ్రతకు మరో 11 మంది కూలీలు తీవ్ర రక్తగాయాలతో రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయారు. సమాచారం అందుకున్న వెంటనే కీసర పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి మార్చురీకి తరలించిన పోలీసులు, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.