పండుగల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు
మూడుచింతలపల్లి మున్సిపల్ చైర్మన్ జాం రవి
శామీర్‌పేట, మేజర్ న్యూస్ (సెప్టెంబర్ 26):బతుకమ్మ, దసరా పండుగలను పురస్కరించుకుని మూడుచింతలపల్లి మున్సిపాలిటీ పరిధిలో అన్ని వార్డుల్లో ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని మున్సిపల్ చైర్మన్ జాం రవి అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన అధ్యక్షతన మున్సిపల్ సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో స్ట్రీట్ లైట్లు, తాగునీటి సరఫరా, పారిశుధ్యం, డ్రైనేజీ, విద్యుత్ సౌకర్యాలతో పాటు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. పండుగల సందర్భంగా ఆలయాల పరిసరాల్లో ప్రత్యేక విద్యుత్ సౌకర్యాలు, పారిశుధ్య పనులు, తాగునీటి సరఫరా, పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి పండుగలను ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించాలని తెలిపారు.ఈ సమావేశంలో కమిషనర్ ఆర్. వెంకట గోపాల్, వైస్ చైర్మన్ మోర్సుబాయ్ శశిరేఖ, కౌన్సిలర్లు ర్యాకల నీరజ్ గౌడ్, ముద్దం పాపిరెడ్డి, గిరిపల్లి రమేష్, మెరుపాటి గోవర్ధన్ రెడ్డి, పెద్దిరెడ్డి శ్రీలత, ఆది అజయ్ కుమార్, కొంపల్లి మాధవి, దోసకాయల లత, మెడబోయిన మౌనిక, కొల్లాస్ రాజు, గిరిపల్లి జ్యోతి, వంగ ప్రియాంక, మూడవత్ నవీన్, గొంది శ్రావణి, ఇర్రి స్వప్న, బొమ్మలపల్లి మల్లేష్,ఆర్వో హర్షద్, ఆర్‌ఐ లు రాజేశ్వర్ రెడ్డి, గౌతమి, డీఈ స్ఫూర్తి, శానిటేషన్ ఇన్‌స్పెక్టర్ మోహన్ సింగ్, ఏటీపీవో సుభాష్ తదితర అధికారులు పాల్గొన్నారు.రిపోర్టర్ రవి గౌడ్.