సపల ఆర్గానిక్ సంస్థను సందర్శించిన సాందీపని డిగ్రీ కళాశాల విద్యార్థులు
సీఈఓ పైడిఎల్లారెడ్డి తో ముఖాముఖి.........
సూర్య కామారెడ్డిజిల్లా ప్రతినిధి సాందీపని డిగ్రీ కళాశాల విద్యార్థులు సపల ఆర్గానిక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థను సందర్శించారు. ఈ సందర్భంగా సంస్థ సీఈవో పైడి ఎల్లారెడ్డి విద్యార్థులతో మాట్లాడి ఆర్గానిక్ రంగంలో ఉన్న అవకాశాలు, పరిశ్రమల పని విధానం, నూతన సాంకేతికత, నైపుణ్యాల అభివృద్ధి, భవిష్యత్ కెరీర్ అవకాశాలపై అవగాహన కల్పించారు.విద్యార్థులు సంస్థ కార్యకలాపాలను ప్రత్యక్షంగా పరిశీలించి, పరిశ్రమకు సంబంధించిన పలు అంశాలపై తమ సందేహాలను అడిగి తెలుసుకున్నారు. చదువుతో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్, సాంకేతిక పరిజ్ఞానం, నైపుణ్యాల అభివృద్ధిపై దృష్టి పెట్టాలని పైడి ఎల్లారెడ్డి విద్యార్థులకు సూచించారు.
విద్య–పరిశ్రమ అనుసంధానం ద్వారా విద్యార్థులకు భవిష్యత్ కెరీర్‌పై స్పష్టమైన అవగాహన ఏర్పడుతుందని, ఇలాంటి పరిశ్రమ సందర్శనలు విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సాందీపని డిగ్రీ కళాశాల విద్యార్థినీ విద్యార్థులు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.