BREAKING
సుమలత విభజించి పాలిస్తున్నారు.. అందుకే యూనియన్‌లో సమస్యలు: రఘు మాస్టర్ సంచలన ఆరోపణలు అనకాపల్లిలో కూటమి సమన్వయ సమావేశంలో ఎన్నికలపై సుదీర్ఘ చర్చ...... నాని ‘ది ప్యారడైజ్’ సినిమాపై ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు! గ్లోబల్ స్థాయిలో 'రామాయణం' ప్రమోషన్స్.. మిస్టర్ బీస్ట్‌తో మేకర్స్ మాస్టర్ ప్లాన్! విదేశీ ఉద్యోగం.. ఇక ప్రభుత్వ మార్గంలోనే..! నాని ‘ది ప్యారడైజ్’ మూవీపై కేటీఆర్ ఆసక్తికర పోస్ట్.. టాలీవుడ్ అంచనాలు తారాస్థాయికి! ప్రయాణికులకు మరింత చేరువగా పోలీస్ సేవలు కొత్త హెయిర్‌స్టైల్‌తో అనసూయ రచ్చ.. తగ్గేదేలే అంటున్న టాలీవుడ్ బ్యూటీ! మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎంట్రీ.. 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్' అప్‌డేట్ ఎప్పుడంటే! కీర్తి సురేశ్ 'డొరోతి' మూవీ వివాదం.. బోల్డ్ సీన్లు, ఎల్జీబీటీక్యూ కంటెంట్‌పై తీవ్ర విమర్శలు! ఉపాధ్యాయులే భావితరాలకు మార్గదర్శకులు సపల ఆర్గానిక్ సంస్థను సందర్శించిన సాందీపని డిగ్రీ కళాశాల విద్యార్థులు సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియకు వీఆర్ఏల వినతిపత్రం వీఆర్ఏల వినతి పత్రం శనేశ్వరుడికి భక్తులు తైలాభిషేకాలు జక్కంపూడి రాజాను కలిసిన యువజన నేత

పలువురికి జక్కంపూడి రాజా పరామర్శ

Select Suryaa Now
పలువురికి జక్కంపూడి రాజా పరామర్శ

కోరుకొండ, మేజర్ న్యూస్ :తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండలంలో ఇటీవల మృతి చెందిన పలువురి కుటుంబ సభ్యులను, అనారోగ్యంతో బాధపడుతున్న వారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా శనివారం పరామర్శించారు. బాధిత కుటుంబాల పరిస్థితులను అడిగి తెలుసుకుని వారికి తన సానుభూతి, భరోసా తెలిపారు.

నిడిగట్ల గ్రామంలో ఇటీవల మృతి చెందిన గుడారపు అరవాలు, వల్లభశెట్టి రమణమ్మ కుటుంబ సభ్యులను జక్కంపూడి రాజా పరామర్శించి సానుభూతి వ్యక్తం చేశారు. బూరుగుపూడిలో గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్న నడిపెల్లి శ్రీనివాసును పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అదే గ్రామంలో అనారోగ్యంతో మృతి చెందిన గడ్డం రాజు కుటుంబ సభ్యులను కలిసి సంతాపం తెలిపారు.

ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో ఇల్లు పూర్తిగా దగ్ధమై నిరాశ్రయులైన మంగం శివ, అమ్ములు కుటుంబాలను కూడా ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని, అవసరమైన సహాయం అందించేందుకు కృషి చేస్తామని భరోసా ఇచ్చారు.

పశ్చిమ గోనగూడెం గ్రామంలో వినాయక చవితి సందర్భంగా చెరువులో పూల సేకరణకు వెళ్లి మృతి చెందిన సోడదాసి వీరబాబు, గోనుపాటి శివ కుటుంబ సభ్యులను జక్కంపూడి రాజా పరామర్శించారు. వారికి తన ప్రగాఢ సానుభూతి, సంతాపాన్ని తెలియజేశారు. అనంతరం కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న తాటికొండ వీర వెంకట దుర్గా ప్రసాద్ (పండు)ను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిపై వివరాలు తెలుసుకున్నారు.

ఈ పర్యటనలో స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు జక్కంపూడి రాజా వెంట ఉన్నారు.