చాకలి ఐలమ్మ జయంతి.. తడగొండ లో ఘన నివాళులు..
సూర్య బోయినపల్లి..
తెలంగాణ సాయుధ పోరాట వీరనారి, మహిళా ధైర్యానికి ప్రతీక, అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడిన చాకలి ఐలమ్మ జయంతి పురస్కరించుకొని తడగొండ గ్రామపంచాయతీలో ఆమె ఫోటోకు పూలమాలలు వేసి ఆమెకు ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చాకలి ఐలమ్మ ధైర్యం, తెగువ, పోరాట పటిమ, ఆత్మగౌరవం ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. అణగారిన వర్గాల హక్కుల కోసం, భూస్వామ్య పెత్తందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా ఆమె సాగించిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఉయ్యాల శ్రీనివాస్ గౌడ్ ఉపసర్పంచ్ చేపూరి వెంకటేష్, వార్డు సభ్యులు, మండల మాజీ కోఆప్షన్ సభ్యులు హైమద్ హుస్సేన్, నాయకులు చేపూరి కనకయ్య, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.