BREAKING
తలకింద ఫోన్ పెట్టుకుని పడుకుంటున్నారా? అయితే ఈ తీవ్రమైన ఆరోగ్య ముప్పు తప్పదు! యుఎల్‌సి దరఖాస్తులకు మోక్షం కొన్ని దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులు అర్హత ఉన్న కేసులను పరిశీలించి క్రమబద్ధీకరించాలని ఆదేశాలు 22ఏ చిక్కుముడులను ఒక్కొక్కటిగా విప్పుతున్న ప్రభుత్వం శాసనసభలో సీఎం ఇచ్చిన హామీలకు కార్యరూపం ఇప్పటికే మూడు కీలక నిర్ణయాలు తాజాగా యుఎల్‌సిపై స్పష్టమైన ఉత్తర్వుల కొండగట్టు అంజన్నను దర్శించుకుని హనుమాన్ దీక్ష స్వీకరించిన హీరో వరుణ్ తేజ్ ది ప్యారడైజ్ మూవీలో కేసీఆర్ పాత్రపై కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు: థియేటర్లలో దద్దరిల్లిన రెస్పాన్స్ టీజీ సేఫ్‌ నోటీసులను బేఖాతరు చేస్తున్న హోటళ్లు రాంగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు అర్థరహితం వైఎస్ఆర్సిపి నాయకులు రూ.97 వేలతో లడ్డూ సొంతం చేసుకున్న బొబ్బల దంపతులు ఏఐతో పర్యాటక రంగానికి మరింత ఊతం* మిరపకాయ్ హీరోయిన్ దీక్షా సేథ్ లేటెస్ట్ ఫోటోలు వైరల్: ఎంతగా మారిపోయిందో చూడండి రూ.1.06 లక్షలకు డైమండ్ యూత్ గణేష్ లడ్డూ ఉగ్రదాడులకు తగిన ప్రతిస్పందన తప్పదు: మోదీ సర్జికల్‌ స్ట్రైక్‌ భారత్‌ ప్రతిస్పందనకు ఉదాహరణ.. జనగణన జాతీయ బాధ్యత శోభిత ధూళిపాళ్ల ఆసక్తికర వ్యాఖ్యలు: ఒకప్పుడు రిజెక్ట్ చేసిన బ్రాండ్‌కే అంబాసిడర్‌గా ఆదుకోండి... సహాయం చేయండి... - అధికారులను వేడుకుంటున్న బాధితుడు డప్పు ఎల్లమ్మ కుటుంబానికి సర్పంచ్ సీమా సుల్తానా ఆర్థిక సాయం బీఆర్‌ఎస్‌, బీజేపీ వికృత చేష్టలు

శాంతిభద్రతుల పరిరక్షణతో పాటు ప్రజల సేవలో ఉండాలి

Select Suryaa Now
శాంతిభద్రతుల పరిరక్షణతో పాటు ప్రజల సేవలో ఉండాలి

శాంతి భద్రతలు పరిరక్షణలోనే కాకుండా ప్రజాసేవలోనూ పోలీసులు ముందుండాలి
--పిటిసి లు పాసింగు ఔట్ పరేడ్ ​శిక్షణ పూర్తిచేసుకున్న కానిస్టేబుళ్ల నుంచి గౌరవ వందనం స్వీకరించిన రాష్ట్ర మంత్రి  పార్థసాధి     ఏలూరు, మేజర్ న్యూస్ : స్థానిక పోలీసు పెరేడ్ గ్రౌండులో శనివారం  పెదవేగి పోలీసు ట్రైనింగు సెంటరు  ఆధ్వర్యంలో 136 మంది శిక్షణ పూర్తిచేసుకున్న స్టైఫండ్రీ క్యాడెటు ట్రైన పోలీసు కానిస్టేబుళ్ళు పాసింగు ఔట్ పరేడ్ ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌరసంబంధాలు శాఖ మంత్రి కొలుసు పార్థసారథి విశిష్ట అతిథిగా హాజరు అయ్యి, శిక్షణ పూర్తిచేసుకున్న పోలీసులు నుండి గౌరవ వందనాన్ని స్వీకరించారు. మంత్రితో పాటు ఏలూరు రేంజీ ఐజి జి.వి.జి.అశోక్ కుమార్, జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి, ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి), అసిస్టెంటు కలెక్టరు సి.హెచ్.శ్రావణ్ కుమార్ రెడ్డి లు పాల్గొన్నారు.
శిక్షణ ఇచ్చిన బృందానికి, శిక్షణకాలంలో విధినిర్వహణ, క్రమశిక్షణ, క్రీడలు, ఇండోర్- అవుట్‌డోర్ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన ఉత్తమ క్యాడెట్లకు మెమొంటో పురస్కారాలను, శిక్షణ పూర్తిచేసుకున్న కానిస్టేబుళ్లకు జ్ఞాపికలను  మంత్రి అందజేశారు.
క్రమశిక్షణతో కూడిన గౌరవ వందనం, పరేడ్ ప్రదర్శనలు, మార్చ్ ఫాస్ట్ లు  ఆహుతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
ఈ సందర్భంగా మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ సమాజంలో శాంతిభద్రతలు పరిరక్షణతో పాటు సామాజిక బాధ్యతతో ప్రజలకు సేవలు అందించేందుకు నూతన పోలీసు కానిస్టేబుళ్లు ఎల్లప్పుడూ అంకిత భావంతో పనిచెయ్యాలని పిలుపు నిచ్చారు. ​పోలీసుశాఖలో ఈ రోజు ఒకగొప్ప పండుగరోజని, నిరుపేద, మధ్యతరగతి కుటుంబాలు వారు బీటెక్లు, యంఏ, పిహెచ్డీలు ఇలా ఎన్నో ఉన్నత చదువులు చదివి పోలీసు శాఖను ఎన్నుకున్నందుకు అభినందనలు తెలియజేశారు. మన తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మనల్ని చదివించారని ఈ రోజు ప్రభుత్వంలో పోలీసు శాఖలో విధులు నిర్వహించబోతున్నారని, మన తల్లిదండ్రులతో పాటు, దేశానికి, రాష్ట్రానికి మంచి సేవలు అందించాలని అన్నారు. రెవిన్యూ, పోలీసు శాఖలు సమాజంలో గౌరవం, గుర్తింపు ఉందని, వాటిని నిలుపుకుంటూ ప్రజలకు మంచి సేవలు చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని అన్నారు. మన గురువులు మంచి పౌరులను తీర్చిదిద్దితే, మంచి సమాజాలుగా తీర్చిదిద్దే అవకాశం పోలీసు శాఖకు ఉందని, ప్రతి పోలీసు ఆలోచనలు చేసి ముందుకు అడుగులు వెయ్యాలని అన్నారు. కఠినమైన శిక్షణను 9 నెలలు పాటు విజయవంతంగా పూర్తిచేసుకుని ప్రజాసేవకు సిద్ధమైన నూతన కానిస్టేబుళ్లకు అభినందనలు తెలిపారు.​ పోలీసు ఉద్యోగం అనేది కేవలం జీవనోపాధి మాత్రమే కాదని, ప్రజలు ప్రాణ, మాన, ఆస్తి రక్షణ బాధ్యత వహించే అత్యున్నతమైన బాధ్యత అని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో చట్టాన్ని అమలు చేయడంలో నిష్పాక్షికంగా వ్యవహరిస్తూ, బాధితులకు తక్షణన్యాయం అందించే విధంగా పోలీసులు పనిచెయ్యాలని సూచించారు. ​పెరుగుతున్న ఆధునిక సాంకేతిక నేరాలను అరికట్టేందుకు మంచి టెక్నాలజీ నైపుణ్యాలను ఎప్పటికప్పుడు పెంపొందించుకోవాలని అన్నారు. ​రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం పోలీసు పోస్టులు భర్తీ చేస్తూ, సంక్షేమానికి, పోలీసు వ్యవస్థ బలోపేతానికి పూర్తిసహాయ, సహకారాలు అందిస్తుందని అన్నారు. సమాజంలో శాంతిభద్రతలు పరిరక్షణలో పోలీసులు పాత్ర అత్యంత కీలకమైందని స్పష్టం చేశారు. ఆధునిక సాంకేతికతను, పారదర్శకంగా, నిష్పక్షపాతంగా బాధ్యతలు నిర్వర్తించి ప్రజలు నమ్మకాన్ని చూరగొనాలని మంత్రి పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా ఏలూరు రేంజీ ఐజి జి.వి.జి.అశోక్ కుమార్ మాట్లాడుతూ పోలీసు విధుల్లో అంకిత భావం, క్రమశిక్షణ, నిజాయితీ, ప్రజలు పట్ల బాధ్యతాయుత వైఖరి ఎంతో ముఖ్యమని సూచించారు. ఏలూరు జిల్లాలో ట్రైనీ పోలీసులకు మంచి శిక్షణ ఇచ్చిన జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివకిషోర్ కు ప్రత్కేక అభినందనలు తెలిపారు. ప్రజలు రక్షణ, శాంతిభద్రతలు పరిరక్షణలో పోలీసులు పాత్రకీలకమని పేర్కొంటూ, శిక్షణలో నేర్చుకున్న నైపుణ్యాలను విధినిర్వహణలో సమర్థవంతంగా వినియోగించాలని  సూచించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ పోలీసుశాఖ ప్రతిష్టను మరింత ఇనుమడింప జేసేలా విధులు నిర్వహించాలని ఆకాంక్షించారు. ఏ జిల్లాలో విధులు నిర్వహించినను మీరు తెచ్చే మంచి పేరు మన ఏలూరు జిల్లాకు దక్కుతుందని అన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ సుదీర్ఘమైన కఠిన శిక్షణను విజయవంతంగా పూర్తిచేసుకుని ప్రజారక్షణ విధుల్లోకి అడుగు పెడుతున్న శిక్షణార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. శాంతిభద్రతలు పరిరక్షణ, నేరనియంత్రణలో పోలీసులు పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు.
​ప్రజలు, బాధితులకు తక్షణ న్యాయం అందించే విధంగా స్నేహపూర్వక వాతావరణంలో పనిచెయ్యాలని సూచించారు. ​నైతిక విలువలు పాటిస్తూ విధి నిర్వహణలో రాజీ పడకుండా, రాజ్యాంగ బద్ధంగా నైతిక విలువలను కాపాడాలని స్పష్టం చేశారు. ​ఆధునిక సాంకేతికతతో సైబరు నేరాలు, నూతన సవాళ్లను ఎదుర్కొనేందుకు నిరంతరం నైపుణ్యాలను మెరుగు పరుచుకోవాలని అన్నారు.ఈ సందర్భంగా ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి)  మాట్లాడుతూ ఉన్నత చదువులు చదివి పోలీసుశాఖను ఎన్నుకున్నందుకు మీ అందరికీ అభినందనలు తెలుపుతున్నానని అన్నారు. సమాజంలో ఏటువంటి జులాయి, పోకిరి అయినను పోలీసు యూనిపామ్ చూస్తే 95 శాతం తప్పక మార్పువస్తుందని అన్నారు. పోలీసు శాఖ ఎంతో బాధ్యత, ఎన్నో సవాళ్లతో కూడుకున్నదని, ప్రజలు రక్షణ, శాంతిభద్రతలు పరిరక్షణకు అంకిత భావంతో పనిచెయ్యాలని సూచించారు. శిక్షణలో నేర్చుకున్న నైపుణ్యాలను విధుల్లో సమర్థవంతంగా వినియోగిస్తూ ప్రజలకు మెరుగైనసేవలు అందించి, అందరి మన్ననలు పొందాలని అన్నారు.​ఈ కార్యక్రమంలో ఏఎస్పీ వై.ప్రసాదరావు, ఏఆర్ ఏఎస్పీ జి.పులిరాజు, మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళీరామకృష్ణ, డిఎస్పి డి.శ్రావణ్ కుమార్, పెదవేగి పోలీసు అధికారులు, పోలీసు ట్రైనింగు శిక్షకులు, పోలీసు అధికారులు, శిక్షణ పూర్తిచేసుకున్న కానిస్టేబుళ్ళు, వారి కుటుంబ, బంధువర్గ సభ్యులు, పట్టణ ప్రముఖులు, కూటమి నాయకులు, పట్టణ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.