BREAKING
కేసీఆర్‌ ప్రజల గుండెల్లో ఉన్నారు.. రెండేళ్లలో మళ్లీ మా పాలనే: కేటీఆర్‌ యూట్యూబ్‌ను ఊపేస్తున్న బంగులా ఫోక్ సాంగ్: రెండే రోజుల్లో రికార్డు వ్యూస్‌తో ట్రెండింగ్ బాధిత కుటుంబాలను పరామర్శించిన చెరుకు శ్రీనివాస్ రెడ్డి. రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం ..... రైతుల పక్షపాతి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు --కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పూర్వ విద్యార్థుల సమ్మేళనం-మూడు దశాబ్దాల తర్వాత మిత్రుల కలయిక శక్తి స్వరూపిణి పోలేరమ్మ తల్లి జాతర వైభవానికి వేళాయె -పొదలకూరు పోలేరమ్మ తల్లి జాతరకు మంత్రి ఆనంకు ఆహ్వానం! చిన్న వెంకన్న మండలంలోని రోడ్లు నిర్మాణానికి 9 కోట్ల రెండు లక్షల రూపాయలు నిధులు మంజూరు ఎమ్మెల్యే మద్దిపాటి భావితరాలకు మనం ఇచ్చే సంపద చెట్లే.. -నరుకూరులో మొక్కలు నాటిన టీడీపీ యువనేతలు సోమిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, శృతి.. శ్రీవారి నిత్యాన్నదాన పథకానికి రూ.3,00,000/లు విరాళం వైసీపీ వి చీప్ పాలిటిక్స్-మంత్రి నారాయణ. ఓటీటీలోకి సునీల్ సూపర్ హిట్ మలయాళ యాక్షన్ థ్రిల్లర్: ఆహాలో స్ట్రీమింగ్ కాట్టాలన్ ప్రకృతి పరిరక్షణతోనే ఆరోగ్యకరమైన సమాజం ఎమ్మెల్యే రోషన్‌పై దుష్ప్రచారాన్ని ఖండించిన గ్రామస్తులు రణబాలి సినిమాకు ముందు డాక్యుమెంటరీ విడుదల: చిత్ర యూనిట్ కీలక నిర్ణయం డైమండ్స్ లయన్స్ ఆధ్వర్యంలో గొడుగులు పంపిణీ

ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు. :

Select Suryaa Now
ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు. :

 

వేడుకలో పాల్గొన్న జిల్లా ఇన్‌ఛార్జ్ అదనపు కలెక్టర్ (రెవెన్యూ) రాథోడ్ రమేష్


సూర్య నిర్మల్ ప్రతినిధి 

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని నేటి తరం ఆదర్శంగా తీసుకుని సమాజ అభ్యున్నతికి కృషి చేయాలని జిల్లా ఇన్‌ఛార్జ్ అదనపు కలెక్టర్ (రెవెన్యూ) రాథోడ్ రమేష్ అన్నారు.జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో శనివారం చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ రాథోడ్ రమేష్, అధికారులు, వివిధ సంఘాల నాయకులతో కలిసి చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో చాకలి ఐలమ్మ పోషించిన పాత్ర, ఆమె పోరాట స్ఫూర్తి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాయని అన్నారు. నాటి కాలంలో రజాకారులు, దొరలు, భూస్వాముల దోపిడీకి వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడిన వీరనారి ఐలమ్మ అని పేర్కొన్నారు. వెట్టి చాకిరీ నిర్మూలనతో పాటు అణగారిన వర్గాల హక్కుల కోసం ఆమె చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమని తెలిపారు.చాకలి ఐలమ్మ ఆశయాలు, పోరాట స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఐలమ్మ వంటి వీర వనితల చరిత్రను నేటి తరం తెలుసుకోవడంతో పాటు, వారి స్ఫూర్తిని సమాజంలో మరింత విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు.ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ చాకలి ఐలమ్మ పోరాట గాథ, ధైర్యసాహసాలు, సామాజిక న్యాయం కోసం ఆమె చేసిన కృషిని స్మరించుకున్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ అధికారి శ్రీనివాస్, డీఆర్డీవో విజయలక్ష్మి, ఈ డి ఎస్సి కార్పొరేషన్ శంకర్, కార్మిక శాఖ అధికారి రాజలింగు, సహాయ బీసీ సంక్షేమ అధికారి సత్యనారాయణ, రాష్ట్ర మానవ హక్కుల సంఘం వైస్ ప్రెసిడెంట్ అర్చన, కుల సంఘాల నాయకులు సుంకెట పోశెట్టి, గజ్జారాం, గంగాధర్, మస్కాపురం పోశెట్టి, రాజేశ్వర్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.