BREAKING
ప్రకృతి వ్యవసాయంపై ఇండోనేషియా శాస్త్రవేత్తల బృందం పర్యటన పాలన మరిచి తిట్లతో కాలం గడుపుతున్న కాంగ్రెస్ నాయకులు కల్తీ భయం లేకుండా ఇంట్లోనే స్వచ్ఛమైన కొబ్బరి నూనె తయారు చేసుకోండిలా.. టీడీపీలో చేరిన మంగళగిరి నియోజకవర్గ వైసీపీ నేతలు గీతాంజలి విద్యాలయం లో భగత్‌సింగ్ జయంతి వేడుకలు నేపాల్‌ను ముంచెత్తిన ప్రకృతి బీభత్సం టీడీపీలో చేరిన వైసీపీ కార్యకర్తలు శ్రీ ప్రకాశం మున్సిపల్ హైస్కూల్‌లో చిత్రలేఖనం, వక్తృత్వ పోటీలు 28వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి అగ్గారపు శ్రీనివాసులు ఇంటింటి ప్రచారం అప్పుల బాధతో కూలీ ఆత్మహత్య యువత భవితకు భరోసా కార్యక్రమంలో ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ ప్రమాదవశాత్తు కింద పడి వ్యక్తి మృతి మోడల్ సోలార్ విలేజ్ పోటీకి ఐదు గ్రామాలు మదర్ డెయిరీ డైరెక్టర్ గా చీర లావణ్య మహిపాల్ విజయం కూటమి పాలనతోనే రాష్ట్రానికి శ్రీరామరక్ష

కేసీఆర్‌ ప్రజల గుండెల్లో ఉన్నారు.. రెండేళ్లలో మళ్లీ మా పాలనే: కేటీఆర్‌

Select Suryaa Now
కేసీఆర్‌ ప్రజల గుండెల్లో ఉన్నారు.. రెండేళ్లలో మళ్లీ మా పాలనే: కేటీఆర్‌

హైదరాబాద్‌: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రజల గుండెల్లో ఉన్నారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా కొనసాగి ఉంటే శంషాబాద్‌ విమానాశ్రయానికి మెట్రో రైలు వచ్చేదని పేర్కొన్నారు. తమ ప్రభుత్వ హయాంలో ఎయిర్‌పోర్టు మెట్రోకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ పూర్తయిందని, కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రాజెక్టును రద్దు చేసిందని ఆరోపించారు.

మూసీ అభివృద్ధి పేరుతో ఇళ్లను కూల్చివేయాల్సిన అవసరం ఏముందని కేటీఆర్‌ ప్రశ్నించారు. ఇళ్లు కూల్చకుండా మూసీ అభివృద్ధి చేయడం ప్రభుత్వానికి చేతకాదా అని నిలదీశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం మూడేళ్ల పాలనలో హైదరాబాద్‌లో ఒక్క ఇల్లైనా నిర్మించిందా అని ప్రశ్నించారు. ప్రభుత్వ లక్ష్యం భూములు అమ్ముకోవడమేనని ఆయన ఆరోపించారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలనలో తొలి అర్ధభాగం పూర్తయిందని, మరో రెండేళ్లలో తమ ప్రభుత్వం తిరిగి వస్తుందని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం రెచ్చిపోతున్న వారిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు. ‘‘వానపాములు కూడా బుసలు కొడుతున్నాయి. సమయం వచ్చినప్పుడు ఎవరినీ వదిలిపెట్టం’’ అని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు.