యూట్యూబ్‌ను ఊపేస్తున్న బంగులా ఫోక్ సాంగ్: రెండే రోజుల్లో రికార్డు వ్యూస్‌తో ట్రెండింగ్
సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: తెలుగు సంగీత ప్రపంచంలో జానపద పాటల జోరు ఏ స్థాయిలో సాగుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. విడుదలైన గంటల్లోనే మిలియన్ల కొద్దీ వ్యూస్‌ను సాధిస్తూ మ్యూజిక్ లవర్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంటున్న సరికొత్త ఫోక్ సాంగ్ ప్రస్తుతం డిజిటల్ మాధ్యమాలను షేక్ చేస్తోంది. యూట్యూబ్‌లో విడుదలైన కేవలం రెండు రోజుల్లోనే రికార్డు స్థాయి వ్యూస్‌తో దూసుకెళ్తున్న బంగులా అనే జానపద పాట నెట్టింట సంచలన సృష్టిస్తోంది. గ్రామీణ నేపథ్యం, అలరించే రిథమ్‌తో రూపొందిన ఈ పాటను సంగీత దర్శకుడు మదీన్ ఎస్కే అద్భుతమైన ట్యూన్‌తో స్వచ్ఛమైన ఫోక్ ఫ్లేవర్‌లో అందించగా, శ్రోతలు ఈ పాటకు మంత్రముగ్ధులవుతున్నారు.
ఈ పాటకు మరింత ప్రాణం పోస్తూ ప్రముఖ గాయకులు ఆలపించిన తీరు ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. పాపులర్ సింగర్ మధుప్రియ తనదైన ఎనర్జిటిక్ వాయిస్‌తో పాటలోని భావాన్ని అద్భుతంగా పండించగా, ఆమెతో పాటు మరో జానపద గాయని నాగవ్వ స్వరం పాటలోని జోరును రెట్టింపు చేసింది. పాటలోని ప్రతీ లైన్, లయబద్ధమైన డప్పు దెబ్బలు సంగీత ప్రియులను చిందులు వేసేలా చేస్తున్నాయి. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ పాటకు సంబంధించిన రీల్స్, షార్ట్స్ కనిపిస్తుండటంతో దీని క్రేజ్ రోజురోజుకు విపరీతంగా పెరుగుతోంది. ఈ పాట వింటుంటే కాళ్లు కదపకుండా ఉండలేకపోతున్నామని, మధుప్రియ వాయిస్ ఈ పాటకు ప్రధాన ఆకర్షణగా నిలిచిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ట్రెండింగ్ చార్ట్స్‌లో దూసుకెళ్తున్న ఈ జానపద గీతం యూట్యూబ్ షార్ట్స్ మరియు ఇన్‌స్టాగ్రామ్‌లో వేలాది మంది రీల్ మేకర్స్‌తో హోరెత్తిపోతోంది. జానపద పాటలకు ఎప్పుడూ ఉండే ఆదరణను ఈ సాంగ్ మరోసారి నిరూపించడమే కాకుండా, డిజిటల్ వేదికలపై సరికొత్త రికార్డుల దిశగా పయనిస్తోంది. వీకెండ్‌లో మాస్ బీట్స్‌తో ఊర్రూతలూగించే ఈ పాట యువతను, మ్యూజిక్ లవర్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటూ సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్‌గా నిలిచింది. స్వచ్ఛమైన జానపద వాతావరణాన్ని తలపించే ఈ పాట రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులను బద్దలు కొట్టడం ఖాయమని ట్రెండ్ విశ్లేషకులు భావిస్తున్నారు.