BREAKING
ప్రకృతి వ్యవసాయంపై ఇండోనేషియా శాస్త్రవేత్తల బృందం పర్యటన పాలన మరిచి తిట్లతో కాలం గడుపుతున్న కాంగ్రెస్ నాయకులు కల్తీ భయం లేకుండా ఇంట్లోనే స్వచ్ఛమైన కొబ్బరి నూనె తయారు చేసుకోండిలా.. టీడీపీలో చేరిన మంగళగిరి నియోజకవర్గ వైసీపీ నేతలు గీతాంజలి విద్యాలయం లో భగత్‌సింగ్ జయంతి వేడుకలు నేపాల్‌ను ముంచెత్తిన ప్రకృతి బీభత్సం టీడీపీలో చేరిన వైసీపీ కార్యకర్తలు శ్రీ ప్రకాశం మున్సిపల్ హైస్కూల్‌లో చిత్రలేఖనం, వక్తృత్వ పోటీలు 28వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి అగ్గారపు శ్రీనివాసులు ఇంటింటి ప్రచారం అప్పుల బాధతో కూలీ ఆత్మహత్య యువత భవితకు భరోసా కార్యక్రమంలో ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ ప్రమాదవశాత్తు కింద పడి వ్యక్తి మృతి మోడల్ సోలార్ విలేజ్ పోటీకి ఐదు గ్రామాలు మదర్ డెయిరీ డైరెక్టర్ గా చీర లావణ్య మహిపాల్ విజయం కూటమి పాలనతోనే రాష్ట్రానికి శ్రీరామరక్ష

బాధిత కుటుంబాలను పరామర్శించిన చెరుకు శ్రీనివాస్ రెడ్డి.

Select Suryaa Now
బాధిత  కుటుంబాలను పరామర్శించిన చెరుకు శ్రీనివాస్ రెడ్డి.

బాధిత  కుటుంబాలను పరామర్శించిన చెరుకు శ్రీనివాస్ రెడ్డి.

తొగుట: మండలంలోని చందాపూర్, తుక్కాపూర్ గ్రామాల్లో ఇటీవల మరణించిన పలు కుటుంబాలను దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి  పరామర్శించారు.. చందాపూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆత్మకూరు రాజు తండ్రి బాలలింగం ఇటీవల మృతి చెందడంతో దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి, భూమలింగం మృతిపై ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఈ కష్టకాలంలో కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని, కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
అనంతరం తుక్కాపూర్ గ్రామంలో ఇటీవల మృతి చెందిన బర్రెంకల నర్సయ్య కుటుంబాన్ని పరామర్శించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి, నర్సయ్య మృతిపై సంతాపం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.పరామర్శించిన వారిలో మార్కెట్ కమిటీ చైర్మన్ చెరుకు విజయ్ రెడ్డి,మండల పార్టీ అధ్యక్షులు పంది రాజు,దుబ్బాక నియోజకవర్గ  కో ఆర్డినేటర్ సోలిపేట ప్రసాద్ రెడ్డి,రాంపూర్ సర్పంచ్ రవీందర్,  చందాపూర్ సర్పంచ్ చందా లావణ్య స్వామి,మార్కెట్ కమిటీ డైరెక్టర్ చందా సత్తయ్య,మండల ఉపాధ్యక్షులు చిక్కుడు ఉప్పలయ్య,గ్రామ పార్టీ అధ్యక్షులు బండారు రమేష్ గౌడ్,బరెంకల స్వామి, నాయకులు బెజ్జనమైన అనిల్, జంగపల్లి ఆంజనేయులు, అనుముల స్వామి, బెజుగామ కిష్టయ్య,చందనేని యాదయ్య, కమ్మరి సత్తయ్య, విజయ్ కాంత్ తదితరులు పాల్గొన్నారు.