BREAKING
తలకింద ఫోన్ పెట్టుకుని పడుకుంటున్నారా? అయితే ఈ తీవ్రమైన ఆరోగ్య ముప్పు తప్పదు! యుఎల్‌సి దరఖాస్తులకు మోక్షం కొన్ని దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులు అర్హత ఉన్న కేసులను పరిశీలించి క్రమబద్ధీకరించాలని ఆదేశాలు 22ఏ చిక్కుముడులను ఒక్కొక్కటిగా విప్పుతున్న ప్రభుత్వం శాసనసభలో సీఎం ఇచ్చిన హామీలకు కార్యరూపం ఇప్పటికే మూడు కీలక నిర్ణయాలు తాజాగా యుఎల్‌సిపై స్పష్టమైన ఉత్తర్వుల కొండగట్టు అంజన్నను దర్శించుకుని హనుమాన్ దీక్ష స్వీకరించిన హీరో వరుణ్ తేజ్ ది ప్యారడైజ్ మూవీలో కేసీఆర్ పాత్రపై కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు: థియేటర్లలో దద్దరిల్లిన రెస్పాన్స్ టీజీ సేఫ్‌ నోటీసులను బేఖాతరు చేస్తున్న హోటళ్లు రాంగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు అర్థరహితం వైఎస్ఆర్సిపి నాయకులు రూ.97 వేలతో లడ్డూ సొంతం చేసుకున్న బొబ్బల దంపతులు ఏఐతో పర్యాటక రంగానికి మరింత ఊతం* మిరపకాయ్ హీరోయిన్ దీక్షా సేథ్ లేటెస్ట్ ఫోటోలు వైరల్: ఎంతగా మారిపోయిందో చూడండి రూ.1.06 లక్షలకు డైమండ్ యూత్ గణేష్ లడ్డూ ఉగ్రదాడులకు తగిన ప్రతిస్పందన తప్పదు: మోదీ సర్జికల్‌ స్ట్రైక్‌ భారత్‌ ప్రతిస్పందనకు ఉదాహరణ.. జనగణన జాతీయ బాధ్యత శోభిత ధూళిపాళ్ల ఆసక్తికర వ్యాఖ్యలు: ఒకప్పుడు రిజెక్ట్ చేసిన బ్రాండ్‌కే అంబాసిడర్‌గా ఆదుకోండి... సహాయం చేయండి... - అధికారులను వేడుకుంటున్న బాధితుడు డప్పు ఎల్లమ్మ కుటుంబానికి సర్పంచ్ సీమా సుల్తానా ఆర్థిక సాయం బీఆర్‌ఎస్‌, బీజేపీ వికృత చేష్టలు

ప్రకృతి పరిరక్షణతోనే ఆరోగ్యకరమైన సమాజం

Select Suryaa Now
ప్రకృతి పరిరక్షణతోనే ఆరోగ్యకరమైన సమాజం

ప్రకృతి పరిరక్షణతోనే ఆరోగ్యకరమైన సమాజం

మునుగోడు,మేజర్ న్యూస్:

ప్రకృతి పరిరక్షణతోనే ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించగలమనీ బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు గోలి మధుసూదన్ రెడ్డి, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు గడ్డం వెంకట్ రెడ్డిలు అన్నారు.భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం, 25 ఏళ్ల ప్రజాసేవ ప్రస్థానం, సుపరిపాలన కార్యక్రమాల్లో భాగంగా ఆదివారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు పెంబళ్ల జానయ్య ఆధ్వర్యంలో మొక్కలు నాటారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  రాబోయే తరాలకు స్వచ్ఛమైన గాలి, ఆహ్లాదకరమైన వాతావరణం అందించాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు.

ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని వారు పేర్కొన్నారు. పేదరిక నిర్మూలన, ఆహార భద్రత, సాంకేతిక రంగ అభివృద్ధి, ‘మేక్ ఇన్ ఇండియా’, దేశ భద్రత వంటి అంశాలకు కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. రైతుల సంక్షేమం కోసం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా అర్హులైన రైతులకు పెట్టుబడి సాయం అందిస్తుండటంతో పాటు ఎరువులపై సబ్సిడీ ద్వారా రైతులకు మద్దతు అందిస్తున్నట్లు తెలిపారు. 
తెలంగాణలో తక్కువ వర్షపాతం కారణంగా పంట నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతులకు తగిన నష్టపరిహారం అందించకపోతే కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ధర్నా కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. అవసరమైతే అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం నిర్వహించాల్సి వస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకుడు భవనం మధుసూదన్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి యానాల కరుణాకర్ రెడ్డి, జిల్లా నాయకుడు గున్న నవీన్, జిల్లా కార్యవర్గ సభ్యుడు కంభంపాటి నరసింహ, జిల్లా ఉపాధ్యక్షుడు కర్నాటి లింగయ్య, లేబర్ సెల్ జిల్లా కో-కన్వీనర్ మాదగోని నరేందర్ గౌడ్, ఎస్సీ మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యుడు నీరుడు రాజారాం, కిసాన్ మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యుడు జెల్ల రవితేజ, సీనియర్ నాయకుడు బొలుగురి రమేష్, మండల ప్రధాన కార్యదర్శి అక్కెనపల్లి సతీష్, పందుల యాదయ్య, మండల ఉపాధ్యక్షుడు కొత్త శంకర్, కార్యదర్శి ధామ్ విష్ణు, కొండ మల్లేష్, కార్యవర్గ సభ్యుడు పంతంగి వెంకన్న, మండల నాయకులు పెరుమాల శ్రీరామ్, ముక్కామల మహేష్, బీసం కృష్ణ, బొజ్జ రాములు, పోలే వెంకటేశ్వర్లు, కడారి నరసింహ తదితరులు పాల్గొన్నారు.