బాపూజీ ఆశయాలు స్ఫూర్తిదాయకం:మల్లేష్ యాదవ్
చౌటుప్పల్: పట్టణ కేంద్రంలో స్వర్గీయ ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి కార్యక్రమాన్ని బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి చినుకని మల్లేష్ యాదవ్ బాపూజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మల్లేష్ యాదవ్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో కొండా లక్ష్మణ్ బాపూజీ పోషించిన పాత్ర చిరస్మరణీయమన్నారు. బడుగు, బలహీన వర్గాల హక్కుల కోసం ఆయన చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. సామాజిక న్యాయం, సమానత్వం కోసం బాపూజీ ఆశయాలను నేటి యువత ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఆయన సేవలను స్మరించుకోవడమే నిజమైన నివాళి అని అన్నారు. కార్యక్రమంలో ఓబీసీ పట్టణ అధ్యక్షుడు చీకురి సాయిరాం, గోశిక భావనఋషి తదితరులు పాల్గొన్నారు.