BREAKING
- భారత జట్టులో చాకలి శేరిపల్లి బిడ్డకు ఘన సత్కారం. తెలంగాణకు మరో ఆణిముత్యం కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మను కలిసిన భీమవరం మీడియా క్లబ్ ప్రతినిధులు ఎస్.ఎస్. రాజమౌళి సినీ ప్రస్థానానికి 25 ఏళ్లు: టాలీవుడ్ స్థాయిని ప్రపంచానికి చాటిన దిగ్గజ దర్శకుడు రామాయణ మూవీ ట్రైలర్ విడుదల.. రాముడిగా రణ్‌బీర్ కపూర్, రావణాసురుడిగా యశ్ అరిపించేశాయ్ చీమకుర్తి కాలువ ప్రారంభోత్సవానికి భారీగా తరలిరావాలి వైద్యుల సమయస్ఫూర్తి – పాముకాటు బాధితుడికి పునర్జన్మ స్వశక్తితో ఎదగాలి.. మహిళలకు అండగా నిలవాలి అనంతపల్లిలో ఉల్లాస్ పరీక్ష - 45 మంది మహిళలకు నిర్వహణ.. ప్రజలకు న్యాయవ్యవస్థను మరింత చేరువ చేయాలి హాస్టల్‌లో పరిశుభ్రతకు పెద్దపీట డ్రగ్స్ వద్దు.. చదువులే ముద్దు ది ప్యారడైజ్ మూవీలో సంపూర్ణేష్ బాబు భార్యగా నటించిన విషిక రియల్ లైఫ్ గ్లామర్ చూస్తే షాకే! ఎస్ఐఆర్ ప్రక్రియపై క్షేత్రస్థాయి పరిశీలన ది ప్యారడైజ్ మూవీపై కేటీఆర్ భావోద్వేగ ట్వీట్.. నాని సినిమాకు అద్భుతమైన ప్రశంసలు రైతు కోసం నిరంతర పరిశోధన డాక్టర్ ఆర్ఎస్ఎస్‌

ది ప్యారడైజ్ మూవీపై కేటీఆర్ భావోద్వేగ ట్వీట్.. నాని సినిమాకు అద్భుతమైన ప్రశంసలు

Select Suryaa Now
 ది ప్యారడైజ్ మూవీపై కేటీఆర్ భావోద్వేగ ట్వీట్.. నాని సినిమాకు అద్భుతమైన ప్రశంసలు

సూర్య తెలంగాణ డెస్క్: నేచురల్ స్టార్ నాని హీరోగా, టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన తాజా యాక్షన్ ఎంటర్‌టైనర్ ది ప్యారడైజ్ సినిమాపై రాజకీయ, సినీ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ఇప్పటికే దసరా కాంబినేషన్‌లో వచ్చిన ఈ చిత్రం సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల భారీ అంచనాల మధ్య విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. తొలి రోజు కొన్ని వర్గాల నుంచి మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ, కలెక్షన్ల పరంగా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా దూసుకుపోతోంది. ముఖ్యంగా సినిమాలో హైలైట్ అయిన కేసీఆర్ మరియు ఎన్టీఆర్ పాత్రల తీరు ఆడియన్స్‌ను విశేషంగా ఆకట్టుకుంటుండగా, కేసీఆర్ పాత్రను చూసేందుకు ఆయన అభిమానులు థియేటర్లకు పెద్ద ఎత్తున క్యూ కడుతున్నారు.

ఈ సినిమాపై వస్తున్న పాజిటివ్ స్పందన నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ స్వయంగా థియేటర్‌కు వెళ్లి సినిమాను వీక్షించారు. ఆయనతో పాటు మాజీ మంత్రులు జగదీశ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా ఈ చిత్రాన్ని చూశారు. సినిమా వీక్షించిన అనంతరం కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఒక భావోద్వేగ ట్వీట్ చేశారు. ది ప్యారడైజ్ కేవలం ఒక సినిమా కాదని, అది అస్తిత్వం కోసం చేసే ఆరాటం మరియు అణిచివేతపై సాగే పోరాటమని ఆయన కొనియాడారు. సందర్భం వస్తే గడ్డిపోచలు కూడా గడ్డపారలుగా మారుతాయనే బలమైన సామాజిక సందేశాన్ని ప్రేక్షకులకు అందించిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెలకు కేటీఆర్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

ఇదే సందర్భంలో హీరో నాని నటనపై కూడా కేటీఆర్ ప్రశంసల వర్షం కురిపించారు. కథానాయకుడి పాత్రలో నాని అద్భుతంగా జీవించారని, ఆయన నటన సినిమాను మరో స్థాయికి తీసుకెళ్ిందని పేర్కొంటూ మిత్రుడు నానికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన తమ్ముడు ప్రియదర్శికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. సినిమాలోని చావు నోట్లో తల పెట్టయినా మీకు గుర్తింపు తెస్తా అనే పవర్‌ఫుల్ డైలాగ్‌ను తన ట్వీట్‌లో ప్రస్తావిస్తూ కేటీఆర్ ఈ చిత్రాన్ని ప్రశంసించారు. రాజకీయ ప్రముఖుల నుంచి వస్తున్న ఈ ప్రశంసలతో ది ప్యారడైజ్ సినిమాపై మరింత హైప్ పెరిగింది.