BREAKING
పడాలలో వైసీపీ ఎన్నికల సన్నాహక కార్యక్రమం ఓటీటీలోకి రానున్న మమితా బైజు సూపర్ హిట్ సినిమా: స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ హంద్రీనీవా ఉపకాలువకు నిధులు కేటాయించాలి శశి వాకర్స్‌ గ్రౌండ్‌లో స్వచ్ఛతా సేవ బిగ్ బాస్ హౌస్‌లో త్రిగుణ్, అమన్ మధ్య తీవ్ర వాగ్వాదం: మిథిలేష్ ఎగ్జిట్‌తో రంజుగా మారిన ఆట శ్రీఆదిత్య మహిళా డిగ్రీ కళాశాలలో ప్రపంచ పర్యాటక దినోత్సవం విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడొద్దు ఏఐఎస్ఎఫ్ ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ నిలిపివేయాలి: ఎస్‌ఎఫ్‌ఐ బాక్సాఫీస్ వద్ద హనుమాన్ అంశ్ సంచలనం: రూ. 400 కోట్ల కలెక్షన్ల దిశగా ఆధ్యాత్మిక చిత్రం ఎన్టీఆర్ డ్రాగన్ సినిమా షూటింగ్ అప్‌డేట్: బాలీవుడ్ హీరో ఎంట్రీతో క్రేజ్ మోదీ ‘మన్ కీ బాత్’ వీక్షించిన శ్రీనివాస వర్మ - భారత జట్టులో చాకలి శేరిపల్లి బిడ్డకు ఘన సత్కారం. తెలంగాణకు మరో ఆణిముత్యం కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మను కలిసిన భీమవరం మీడియా క్లబ్ ప్రతినిధులు ఎస్.ఎస్. రాజమౌళి సినీ ప్రస్థానానికి 25 ఏళ్లు: టాలీవుడ్ స్థాయిని ప్రపంచానికి చాటిన దిగ్గజ దర్శకుడు రామాయణ మూవీ ట్రైలర్ విడుదల.. రాముడిగా రణ్‌బీర్ కపూర్, రావణాసురుడిగా యశ్ అరిపించేశాయ్

వైద్యుల సమయస్ఫూర్తి – పాముకాటు బాధితుడికి పునర్జన్మ

Select Suryaa Now
వైద్యుల సమయస్ఫూర్తి – పాముకాటు బాధితుడికి పునర్జన్మ

 

మృత్యుంజయుడు పురుషోత్తమరావు నాడీ విషాన్ని జయించి ప్రాణాలతో బయటపడ్డ వైనం

35 ఏళ్ల యువకుడిని కాపాడిన విజయనగరం జీజీహెచ్‌ అత్యవసర వైద్యం

కాలంతో పోటీపడి ప్రాణం నిలిపిన వైద్య బృందం

రాత్రికి రాత్రే సాగిన ప్రాణపోరాటం: న్యూరోటాక్సిక్ పాము కాటు నుంచి సురక్షితంగా బయటపడ్డ బాధితుడు

పార్వతీపురం, సెప్టెంబర్ 27: సెప్టెంబర్ 26, 2026 రాత్రి పార్వతీపురం మన్యం జిల్లా పెదబొండపల్లి గ్రామానికి చెందిన 35 ఏళ్ల మమిడిపాక పురుషోత్తమరావు విషపూరితమైన నాడీ విష (న్యూరోటాక్సిక్) పాము కాటుకు గురై తీవ్ర ప్రాణపాయ స్థితిలోకి వెళ్లారు. కుటుంబ సభ్యులు వెంటనే స్పందించి రాత్రి 10:07 గంటలకు పార్వతీపురం జిల్లా ఆసుపత్రికి తరలించగా, అక్కడి వైద్యులు ప్రాథమిక చికిత్స అందించి పరిస్థితి తీవ్రతను బట్టి రాత్రి 10:55 గంటలకు విజయనగరం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి (GGH) రిఫర్ చేశారు. నాడీ వ్యవస్థపై విష ప్రభావం వల్ల కనురెప్పలు వాలిపోవడం, శ్వాస తీసుకోవడం కష్టంగా మారడం లాంటి క్లిష్ట పరిస్థితుల్లో జీజీహెచ్ అత్యవసర విభాగానికి చేరుకోగానే, అక్కడి నిపుణులైన వైద్య బృందం క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంటిలేటర్ మద్దతుతో శ్వాసక్రియను పునరుద్ధరించి, తగిన మోతాదులో యాంటీ స్నేక్ వెనమ్ (ASV) మరియు అవసరమైన ప్రాణరక్షణ మందులను అందించారు. ఐసియు బృందం రాత్రంతా సల్పిన నిరంతర పోరాటం, సమయానుకూల వైద్యం ఫలితంగా పురుషోత్తమరావు మృత్యుముఖం నుండి సురక్షితంగా బయటపడి పూర్తి కోలుకోవడంతో ఈ ఘటన ఒక గొప్ప ప్రాణరక్షణ విజయగాథగా నిలిచింది.

పాము కాటు వేసి శ్వాస ఆడక కన్నుమూసే పరిస్థితికి చేరినప్పుడు ఇక బతుకుతాననే ఆశ వదులుకున్నాను. కానీ విజయనగరం వైద్యులు దేవుళ్లలా వచ్చి నన్ను మృత్యుముఖం నుండి కాపాడారు. రాత్రంతా నా పక్కనే ఉండి కంటికి రెప్పలా చూసుకుని నాకు పునర్జన్మనిచ్చారు" అని బాధితుడు పురుషోత్తమరావు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ​ఆయన కుటుంబ సభ్యులు మాట్లాడుతూ... "అర్ధరాత్రి వేళ ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రికి వచ్చినప్పుడు వైద్యులు క్షణం కూడా ఆలస్యం చేయకుండా చూపిన చొరవ, సమయస్ఫూర్తి వల్లే మా మనిషి ఈ రోజు మా కళ్లముందు ప్రాణాలతో ఉన్నాడు. వైద్య బృందం అందించిన అత్యవసర చికిత్స, చూపిన ఆప్యాయతకు జీవితాంతం రుణపడి ఉంటాం" అని కన్నీటి పర్యంతమవుతూ కృతజ్ఞతలు తెలిపారు.