మోదీ ‘మన్ కీ బాత్’ వీక్షించిన శ్రీనివాస వర్మ
మోదీ ‘మన్ కీ బాత్’ వీక్షించిన శ్రీనివాస వర్మ
భీమవరం, మేజర్ న్యూస్:
భీమవరంలోని బీజేపీ కార్యాలయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ ప్రధాని నరేంద్ర మోదీ 138వ ‘మన్ కీ బాత్’ కార్యక్రమాన్ని వీక్షించారు.ఈ సందర్భంగా ప్రధాని దేశ భద్రత, జనగణన, భారతీయ సంస్కృతి–వారసత్వం, స్వచ్ఛత, పర్యావరణ పరిరక్షణ, యువత, క్రీడలు, స్థానిక ఉత్పత్తులు, పోషణ తదితర అంశాలను ప్రస్తావించారు. 2016 సర్జికల్ స్ట్రైక్స్‌కు పదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఉగ్రవాదంపై భారత్ అనుసరిస్తున్న విధానాన్ని కూడా ప్రధాని వివరించారు.కార్యక్రమంలో బీజేపీ నాయకులు కలిదిండి వినోద్ వర్మ, కోరా రామ్మూర్తి, ఎంవీఎస్ నాగమణి, అడబాల శివ, షేక్ మొహుద్దీన్, శనగవరపు గోవర్ధన్, నడిపూడి పెద్దిరాజు, ఇంజేటి వెంకటేశ్వర్లు, ఉంగరా జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
శ్రీనివాస్ భీమవరం