పడాలలో వైసీపీ ఎన్నికల సన్నాహక కార్యక్రమం
పడాలలో వైసీపీ ఎన్నికల సన్నాహక కార్యక్రమం
తాడేపల్లిగూడెం, మేజర్ న్యూస్; పడాల గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో తాడేపల్లిగూడెం నియోజకవర్గ కో-ఆర్డినేటర్ వడ్డి రఘురామ్ నాయుడ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గ్రామంలో పార్టీ పరిస్థితులు, స్థానికంగా చేపట్టాల్సిన కార్యక్రమాలు, ఎన్నికల సన్నాహకాలపై త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో, నాయకులు, కార్యకర్తలతో ఆయన చర్చించారు.ఈ కార్యక్రమం లో భాగంగా, పడాల గ్రామానికి చెందిన కొంతమంది టీడీపీ నాయకులు వడ్డి రఘురామ్ నాయుడు పనితీరుపై ఆకర్షితులై, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వడ్డి రఘురామ్ నాయుడు వారికి పార్టీ కండువాలు కప్పి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పడాల గ్రామానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
శ్రీనివాస్ తాడేపల్లిగూడెం