కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మను కలిసిన భీమవరం మీడియా క్లబ్ ప్రతినిధులు
కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మను కలిసిన భీమవరం మీడియా క్లబ్ ప్రతినిధులు
భీమవరం మేజర్ న్యూస్:
భీమవరం పట్టణంలో నూతనంగా ఏర్పాటైన భీమవరం మీడియా క్లబ్ ప్రతినిధులు కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆదివారం నిర్వహించిన ఈ భేటీలో మీడియా క్లబ్ ఏర్పాటు, కార్యకలాపాలు, జర్నలిస్టుల వృత్తిపరమైన అవసరాలు, ప్రజా సమస్యలపై చర్చించారు.ఈ సందర్భంగా క్లబ్ ప్రతినిధులు భీమవరం మీడియా క్లబ్ లక్ష్యాలు, జర్నలిస్టుల కోసం చేపట్టనున్న కార్యక్రమాలు, క్లబ్ ఏర్పాటుకు సంబంధించిన వివరాలను మంత్రికి వివరించారు. మీడియా రంగంలో పనిచేస్తున్న జర్నలిస్టులకు అవసరమైన వసతులు, ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లడంలో మీడియా పాత్ర తదితర అంశాలను ప్రస్తావించారు.మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ మాట్లాడుతూ భీమవరం మీడియా క్లబ్ అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తామని తెలిపారు. అనంతరం క్లబ్ ప్రతినిధులను అభినందించారు.ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షుడు ఆరేటి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి వి.ఎన్.ఎల్. మూర్తి, ఉపాధ్యక్షులు సూర్య, కోశాధికారి కేత సత్యనారాయణ, కార్యవర్గ సభ్యులు నిమ్మల ఆదినారాయణ, రాజేంద్ర, సభ్యులు కమ్మిల హనుమంతరావు, అల్లూరి అరుణ్, వెంకటేష్, చింతపల్లి ఆదినారాయణ (ఆదిత్య), కె. చిన్నబాబు, ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.
శ్రీనివాస్ భీమవరం