BREAKING
ఓటీటీని షేక్ చేయడానికి వస్తున్న కీర్తి సురేశ్ 'అక్క' గ్యాంగ్‌స్టర్ సిరీస్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్! డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ వేడుకలో కార్తికేయ భావోద్వేగ ప్రసంగం.. కంటతడి పెట్టుకున్న రమా రాజమౌళి! అనంతపురంలో కేవలం రూ.10లకే కార్పొరేట్ స్థాయి ఫిజియోథెరపీ వైద్యం.. డాక్టర్ కోనంకి శ్రీధర్ సేవలు 'వారణాసి' చిత్రంలో ఏఐ వినియోగంపై క్లారిటీ ఇచ్చిన రాజమౌళి.. అసలు నిజం ఇదే! ఓటీటీలోకి సరికొత్త మైండ్ గేమ్ షో.. హోస్ట్‌గా యంగ్ హీరో తేజ సజ్జ! Jr NTR: భుజం గాయం నుంచి పూర్తిగా కోలుకున్నా.. త్వరలోనే 'డ్రాగన్' షూటింగ్: జూనియర్ ఎన్టీఆర్ విడుదలకు ముందే ఇంటర్‌నెట్‌లో లీకైన 'తెల్ల కాగితం' సినిమా.. మేకర్స్ ఆవేదన! 13 ఏళ్ల తర్వాత ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చిన నేషనల్ అవార్డ్ విన్నింగ్ సినిమా! ఏషియన్ గేమ్స్‌లో విత్యా రామ్‌రాజ్ సంచలనం.. అద్భుతమైన స్ప్రింట్‌తో భారత్‌కు గోల్డ్ మెడల్! అల్లరి నరేష్ ఇంట్లో ఘనంగా కూతురు పుట్టినరోజు వేడుకలు.. క్యూట్ ఫోటోలు వైరల్! భారత ఆర్కిటిక్ యాత్రలో గీతం పరిశోధకుడు విశాఖ ఉక్కులో తప్పిన ముప్పు: నేలపాలైన ద్రవ ఉక్కు జియోఫిజిక్స్ విభాగానికి చెందిన పూర్వ విద్యార్థులు సహకారం గుండె సమస్యలపై శ్రద్ధ వహించాలి..! చోరీ సొత్తు రికవరీలో ప్రతిభ.. సౌత్‌ క్రైమ్‌ పోలీసులకు 4 రివార్డులు

ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం వద్దు

Select Suryaa Now
 ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం వద్దు

ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం వద్దు

నిర్ణీత గడువులోగా పరిష్కరించాలి: కలెక్టర్ నాగరాణి

భీమవరం, మేజర్ న్యూస్: ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నందున పీజీఆర్‌ఎస్‌లో నమోదయ్యే ప్రతి ఫిర్యాదుపై తక్షణమే స్పందించి, నిర్ణీత గడువులోగా సంతృప్తికర పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు.

సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్‌తో పాటు జాయింట్ కలెక్టర్ కె.ఆర్. కల్పశ్రీ, డీఆర్వో పి. గ్లోరియా తదితర అధికారులు ప్రజల నుంచి 161 పీజీఆర్‌ఎస్, 42 రెవెన్యూ ఫిర్యాదులు స్వీకరించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం పదేపదే కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి రాకుండా అధికారులు బాధ్యతగా వ్యవహరించాలన్నారు. పెండింగ్‌ ఫిర్యాదులను శాఖల వారీగా సమీక్షించి, పరిష్కారంలో జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. పదేపదే పునరావృతమవుతున్న సమస్యలను గుర్తించి శాశ్వత పరిష్కారం చూపాలన్నారు.

కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ దత్తత గ్రామమైన పెదమైనవానిలంకలో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. పూర్తికాని పనులకు అవసరమైన నిధులపై ప్రభుత్వానికి నివేదికలు పంపేలా డీఎల్‌డీవో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.

లంక గ్రామాలపై అప్రమత్తత

గోదావరి వరదల నేపథ్యంలో నది పరివాహక ప్రాంతంలోని లంక గ్రామాల ప్రజలను అప్రమత్తం చేసి ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. రెవెన్యూ, వ్యవసాయ, ఉద్యాన, మత్స్య తదితర శాఖలు సమన్వయంతో పనిచేసి ఎలాంటి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వైద్య ఆరోగ్య, పారిశుధ్య చర్యలను ముమ్మరం చేయాలని సూచించారు.

పీజీఆర్‌ఎస్‌లో ప్రజలు చెత్త సమస్య, రహదారి ఆక్రమణలు, వికలాంగుల పింఛన్లు, ఇంటి స్థలాల్లో నిర్మాణాలకు అడ్డంకులు, భూముల రీసర్వేలో తలెత్తిన సమస్యలు, వృద్ధాప్య పింఛన్ తదితర అంశాలపై ఫిర్యాదులు సమర్పించారు.

కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

 

 శ్రీనివాస్ భీమవరం