BREAKING
అంగన్వాడీ కేంద్రాల్లో పోషణ మాసోత్సవాలు 800కు పైగా ఉద్యోగ అవకాశాలు.. నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్ నాగరాణి సాగునీటి రంగాన్ని గాడిలో పెట్టిన కూటమి ప్రభుత్వం శోభాయమానంగా పార్వతీపరమేశ్వరుల ప్రాకారోత్సవం జనసేన అభ్యర్థుల వినతుల స్వీకరణ నిర్ణీత గడువులోగా పరిష్కరించాలి: కలెక్టర్ నాగరాణి టిడిపి నాయకుడు కన్నన్ రెడ్డి జన్మదిన వేడుకలు జడ్పీటీసీ అధ్యక్షుడు పాలూరి మాల్యాద్రి రెడ్డికి ఘన సన్మానం క్యాద్గిరా గ్రామ పంచాయతీ నూతన భవన నిర్మాణం బేస్మెంట్ వరకే పరిమితం సేంద్రియ వ్యవసాయంపై రైతులకు అవగాహన ఆచార్య అల్లం శ్రీనివాసరావుకు మూడు ప్రతిష్ఠాత్మక పురస్కారాలు ‘నమో సేవా గాథ’ ప్రత్యేక వాహనం ప్రారంభం వాయుగుండంతో దెబ్బతిన్న రోడ్లను త్వరలోనే పునరుద్ధరిస్తాం గ్రామాల సర్వతోముఖాభివృద్ధే పల్లె పండుగ లక్ష్యం-మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ నేపాల్‌లో భీభత్సం సృష్టిస్తున్న భారీ వర్షాలు.. వరదలు, కొండచరియలతో 24 మంది మృతి

రామచంద్రపురం లో అక్టోబర్ 1న మెగా జాబ్ మేళా

Select Suryaa Now
రామచంద్రపురం లో అక్టోబర్ 1న మెగా జాబ్ మేళా

రామచంద్రాపురంలో అక్టోబర్ 1న మెగా జాబ్ మేళా.…

 గోడపత్రికను ఆవిష్కరించిన మహేష్ కుమార్ రావిరాల,…

అమలాపురం  మేజర్ న్యూస్ 

రామచంద్రాపురం నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతకు విస్తృతంగా ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు వికాస ఆధ్వర్యంలో, రాష్ట్ర కార్మిక శాఖామంత్రి శ్రీ వాసంశెట్టి సుభాష్ గారి సహకారంతో అక్టోబర్ 1వ తేదీ గురువారం రామచంద్రాపురంలోని వి.ఎస్.ఎం. డిగ్రీ కాలేజీలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.

ఈ సందర్భంగా మెగా జాబ్ మేళాకు సంబంధించిన గోడపత్రికను జిల్లా కలెక్టర్ డాక్టర్ మహేష్ కుమార్ రావిరాల, ఐఏఎస్  ఆవిష్కరించారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ విద్యార్హతలకు అనుగుణంగా ఉద్యోగాలను పొందాలని కలెక్టర్ సూచించారు.20కి పైగా ప్రముఖ కంపెనీలతో ఉద్యోగ అవకాశాలు

ఈ మెగా జాబ్ మేళాలో సుమారు 20 ప్రముఖ కంపెనీలు పాల్గొననున్నాయి. ముఖ్యంగా ఐటీ, బీపీఓ, ఫార్మా తదితర రంగాలకు చెందిన సంస్థలు తమ సంస్థల్లోని వివిధ ఉద్యోగ ఖాళీల కోసం అభ్యర్థులను ఎంపిక చేయనున్నాయి.

SSC, ఇంటర్మీడియట్, డిగ్రీ, ITI, డిప్లొమా,  తదితర విద్యార్హతలు కలిగిన 18 నుంచి 35 సంవత్సరాల లోపు అభ్యర్థులు ఈ జాబ్ మేళాలో పాల్గొనవచ్చు.

రూ.12,000 నుంచి రూ.40,000 వరకు జీతం

ఎంపికైన అభ్యర్థులకు ఆయా కంపెనీలు మరియు ఉద్యోగాల స్వభావాన్ని బట్టి నెలకు రూ.12,000

ఎంపికైన వారికి మంత్రి చేతుల మీదుగా నియామక పత్రాలు

జాబ్ మేళాలో వివిధ కంపెనీలకు ఎంపికైన అభ్యర్థులకు గౌరవ రాష్ట్ర కార్మిక శాఖామంత్రి శ్రీ వాసంశెట్టి సుభాష్  చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేయనున్నట్లు  ప్రాజెక్ట్ డైరెక్టర్ కె లచ్చరావు తెలిపారు 

ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న అర్హత కలిగిన నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అభ్యర్థులు అక్టోబర్ 1వ తేదీ గురువారం ఉదయం 9.00 గంటలకు రామచంద్రాపురంలోని వి.ఎస్.ఎం. డిగ్రీ కాలేజీ వద్దకు తమ విద్యార్హతలు, ఇతర అవసరమైన ధ్రువపత్రాల జిరాక్స్ కాపీలతో హాజరు కావాలి.

అభ్యర్థులు తమ విద్యార్హతలు, నైపుణ్యాలు మరియు ఆసక్తికి అనుగుణంగా అందుబాటులో ఉన్న ఉద్యోగాలను ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది.అని జిల్లా మేనేజర్ గోళ్ళ రమేష్ తెలిపారు, ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సమాచార అధికారి సిహెచ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు