BREAKING
ఎస్.ఎస్. రాజమౌళి సినీ ప్రస్థానానికి 25 ఏళ్లు: టాలీవుడ్ స్థాయిని ప్రపంచానికి చాటిన దిగ్గజ దర్శకుడు రామాయణ మూవీ ట్రైలర్ విడుదల.. రాముడిగా రణ్‌బీర్ కపూర్, రావణాసురుడిగా యశ్ అరిపించేశాయ్ చీమకుర్తి కాలువ ప్రారంభోత్సవానికి భారీగా తరలిరావాలి వైద్యుల సమయస్ఫూర్తి – పాముకాటు బాధితుడికి పునర్జన్మ స్వశక్తితో ఎదగాలి.. మహిళలకు అండగా నిలవాలి అనంతపల్లిలో ఉల్లాస్ పరీక్ష - 45 మంది మహిళలకు నిర్వహణ.. ప్రజలకు న్యాయవ్యవస్థను మరింత చేరువ చేయాలి హాస్టల్‌లో పరిశుభ్రతకు పెద్దపీట డ్రగ్స్ వద్దు.. చదువులే ముద్దు ది ప్యారడైజ్ మూవీలో సంపూర్ణేష్ బాబు భార్యగా నటించిన విషిక రియల్ లైఫ్ గ్లామర్ చూస్తే షాకే! ఎస్ఐఆర్ ప్రక్రియపై క్షేత్రస్థాయి పరిశీలన ది ప్యారడైజ్ మూవీపై కేటీఆర్ భావోద్వేగ ట్వీట్.. నాని సినిమాకు అద్భుతమైన ప్రశంసలు రైతు కోసం నిరంతర పరిశోధన డాక్టర్ ఆర్ఎస్ఎస్‌ దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు స్వల్ప ఊరట ఈజిప్ట్‌లోని అలెగ్జాండ్రియా పోర్టు పర్యటన ముగించుకుని తిరుగు ప్రయాణమైన ఐఎన్ఎస్ సుదర్శిని

కొండా లక్ష్మణ్ బాపూజీ ని తెలంగాణ జాతిపితగా ప్రకటించాలి

Select Suryaa Now
కొండా లక్ష్మణ్ బాపూజీ ని తెలంగాణ జాతిపితగా ప్రకటించాలి

కొండా  లక్ష్మణ్ బాపూజీ ని  తెలంగాణ 
జాతిపితగా ప్రకటించాలి 
.. డాక్టర్ రాజేశ్వర ప్రసాద్..

పరకాల, సెప్టెంబర్ 27, మేజర్ న్యూస్

మూడు తరాల తెలంగాణ స్వాతంత్ర్య పోరాటంలో ముందు వరుసలో నిలిచిన స్వాతంత్ర్య సమరయోధులు, మాజీమంత్రి కొండా లక్ష్మణ్ బాపూజీని తెలంగాణ జాతిపితగా ప్రకటించాలని పరకాల పోపా అధ్యక్షుడు డాక్టర్ పి. రాజేశ్వరప్రసాద్ డిమాండ్ చేశారు. తెలంగాణ కోసం తన మంత్రి పదవిని త్యాగం చేసిన బాపూజీ కి సముచిత గౌరవం కల్పించడంలో భాగంగా మామునూరు విమానాశ్రయానికి ఆయన పేరు పెట్టాలని కోరారు. స్వాతంత్ర్య సమరయోధుడు మాజీ మంత్రి కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతి సందర్భంగా పరకాల పట్టణంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్థానిక బస్సు డిపో జంక్షన్ లోగల ఆయన విగ్రహం వద్ద పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. పద్మశాలి సంఘం అధ్యక్షుడు బాసని దయాకర్ అధ్యక్షతన జరిగిన  కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ రాజేశ్వరప్రసాద్ మాట్లాడుతూ పదవులు అధికారాల కంటే ప్రజల హక్కులకే ప్రాధాన్యతనిస్తూ తన జీవితాన్ని ప్రజా సేవకు అంకితం చేసిన బాపూజీ పోరాట స్ఫూర్తి నేటి తరానికి మార్గదర్శకమని అన్నారు. ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరైన కొండా లక్ష్మణ్ బాపూజీ గ్లోబల్ ఫెడరేషన్ హనుమకొండ జిల్లా కన్వీనర్, సీనియర్ జర్నలిస్ట్ 
మెండు రవీందర్ మాట్లాడుతూ దేశ స్వాతంత్రోద్యమంలో చురుకైన పాత్ర పోషించి మూడు తరాల తెలంగాణ విముక్తి పోరాటాల్లో ముందు వరసలో నిలిచిన లక్ష్మణ్ బాపూజీ కి కేంద్ర ప్రభుత్వం అత్యున్నతమైన భారతరత్న పురస్కారం ప్రకటించాలని కోరారు. నిస్వార్థ ప్రజా సేవకు విలువలతో కూడిన రాజకీయ జీవితానికి అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆయన జీవితం గొప్ప ఆదర్శనీయమని రవీందర్ పేర్కొన్నారు. అనంతరం పేదలకు అన్నదానం చేశారు. పద్మశాలి సంఘం అధ్యక్షుడు దయాకర్ అధ్యక్షతన జరిగిన  కార్యక్రమంలో ట్రస్టు బోర్డు అధ్యక్షుడు డాక్టర్ మంత్రి కాశయ్య మార్కండేయ ఆర్థిక సంఘం అధ్యక్ష కార్యదర్శులు రాచర్ల అశోక్ , తవుటం మధుసూదన్ మాజీ కౌన్సిలర్లు పొరండ్ల సంతోష్, చిదురాల దేవేందర్, పోపా ప్రధాన కార్యదర్శి దుంపేటి నాగరాజు చేనేత సంఘం ఉపాధ్యక్షుడు దార్న వేణుగోపాల్, ట్రస్ట్ బోర్డ్ సభ్యుడు దార్న కుమారస్వామి, నడికుడ మండల అధ్యక్షుడు గాదె శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.