BREAKING
- భారత జట్టులో చాకలి శేరిపల్లి బిడ్డకు ఘన సత్కారం. తెలంగాణకు మరో ఆణిముత్యం కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మను కలిసిన భీమవరం మీడియా క్లబ్ ప్రతినిధులు ఎస్.ఎస్. రాజమౌళి సినీ ప్రస్థానానికి 25 ఏళ్లు: టాలీవుడ్ స్థాయిని ప్రపంచానికి చాటిన దిగ్గజ దర్శకుడు రామాయణ మూవీ ట్రైలర్ విడుదల.. రాముడిగా రణ్‌బీర్ కపూర్, రావణాసురుడిగా యశ్ అరిపించేశాయ్ చీమకుర్తి కాలువ ప్రారంభోత్సవానికి భారీగా తరలిరావాలి వైద్యుల సమయస్ఫూర్తి – పాముకాటు బాధితుడికి పునర్జన్మ స్వశక్తితో ఎదగాలి.. మహిళలకు అండగా నిలవాలి అనంతపల్లిలో ఉల్లాస్ పరీక్ష - 45 మంది మహిళలకు నిర్వహణ.. ప్రజలకు న్యాయవ్యవస్థను మరింత చేరువ చేయాలి హాస్టల్‌లో పరిశుభ్రతకు పెద్దపీట డ్రగ్స్ వద్దు.. చదువులే ముద్దు ది ప్యారడైజ్ మూవీలో సంపూర్ణేష్ బాబు భార్యగా నటించిన విషిక రియల్ లైఫ్ గ్లామర్ చూస్తే షాకే! ఎస్ఐఆర్ ప్రక్రియపై క్షేత్రస్థాయి పరిశీలన ది ప్యారడైజ్ మూవీపై కేటీఆర్ భావోద్వేగ ట్వీట్.. నాని సినిమాకు అద్భుతమైన ప్రశంసలు రైతు కోసం నిరంతర పరిశోధన డాక్టర్ ఆర్ఎస్ఎస్‌

రైతు కోసం నిరంతర పరిశోధన డాక్టర్ ఆర్ఎస్ఎస్‌

Select Suryaa Now
రైతు కోసం నిరంతర పరిశోధన డాక్టర్ ఆర్ఎస్ఎస్‌
- రైతుల అభివృద్ధికి నిరంతర కృషి
- నిరుత్సాహానికి తలవంచని విద్యాభ్యాస సంకల్పం
- పరిశోధనలతో రైతులకు శాస్త్రీయ మార్గదర్శకత్వం
- మూడు లక్షల మంది రైతులకు నిరంతర సేవలు
పామూరు, మేజర్ న్యూస్ : 
చిన్న, పేద రైతుల మేలు కోసం అండగా
భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అయిన వ్యవసాయం నేటి కాలంలో అధిక పెట్టుబడులు, తక్కువ ఆదాయం, నేల నిస్సారత వంటి సమస్యలను ఎదుర్కొంటోంది. ఈ సవాళ్లను అధిగమించి రైతులకు ఉత్తమ మార్గదర్శకత్వాన్ని అందించేందుకు రామిశెట్టి శివశంకర్ నిరంతర కృషి చేస్తున్నారు.
తండ్రి రామిశెట్టి వీరభద్రయ్య పోలీసు శాఖలో 30 సంవత్సరాలు పని చేసి పదవీ విరమణ పొందిన హెడ్‌ కానిస్టేబుల్‌గా తల్లి రామిశెట్టి రమణమ్మ గృహిణిగా కడప జిల్లాలోని పులివెందులలో నివసిస్తున్నారు.
రామిశెట్టి శివశంకర్ పులివెందుల పట్టణంలో బాల్య విద్యాభ్యాసంలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. పదో తరగతి పరీక్షల్లో విఫలమవడం అప్పట్లోనే చదువుకు పనికిరాడు అని ఉపాధ్యాయులు ఏదో ఒక పనిలో చేర్చాలని వారి తండ్రితో చెప్పడం జరిగింది. పడుతూ లేస్తూ ప్రాథమిక విద్యను పూర్తి చేసి తదనంతరం లయోలా కళాశాలలో పట్టభద్రులయ్యారు.2006-2007లో ఉప పరిశీలకుడి పరీక్షలకు సిద్ధమై పరీక్ష రాసినా కేవలం 0.25 మార్కుల తేడాతో అర్హత సాధించలేకపోయారు. అదేవిధంగా గ్రూప్-1 కోసం దాదాపు రెండు సంవత్సరాలు చదివి రెండు మూడు మార్కుల తేడాతో సాధించలేకపోయారు.
2008లో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో జంతుశాస్త్రంలో స్నాతకోత్తర విద్యను పూర్తి చేశారు. 2010లో జంతు శరీర ధర్మశాస్త్ర విభాగంలో పీహెచ్‌డీ పరిశోధన ప్రారంభించి, 2011లో విశ్వవిద్యాలయ మంజూరు సంఘం ప్రాజెక్టుగా ఎర్ర ద్రాక్ష పండు (వీటిస్ వినిఫెరా) అంశంపై పరిశోధనలు చేపట్టారు. 2012-2013లో విశ్వవిద్యాలయ మంజూరు సంఘం ప్రాజెక్టు పూర్తయ్యి, 2014లో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్‌డీ పట్టాను పొందారు.
స్వతంత్ర శాస్త్రవేత్తగా సొంత పరిశోధన
2015లో వృక్ష శరీర ధర్మశాస్త్రం వృక్ష వ్యాధి శాస్త్రం మరియు జంతు శరీర ధర్మశాస్త్రం అంశాలపై విస్తృత పరిశోధనలు నిర్వహించి, సుమారు 40 జాతీయ మరియు అంతర్జాతీయ పరిశోధనా పత్రికల్లో పరిశోధన పత్రాలు ప్రచురించారు. ఇందులో రెండు జర్మన్ ప్రచురణ పుస్తకాలు ఉన్నాయి.
స్వతంత్ర శాస్త్రవేత్తగా పూర్తి క్షేత్ర పరిశోధన
2018-2020లో చీనీ పంటపై పరిశోధన కార్యక్రమాలు చేపట్టారు. అక్కడే రాత్రింబవళ్లు ఉంటూ పూర్తి క్షేత్ర పరిశోధన చేపట్టారు.
దేశవ్యాప్తంగా క్షేత్ర పరిశీలనలు
2020-2023లో దక్షిణ భారతదేశం మొత్తం అనేక పండ్ల తోటలను క్షేత్రస్థాయిలో సందర్శించి, పంటలకు సంబంధించి మొట్టమొదటిసారిగా ప్రామాణిక విధానాలను కనుగొన్నారు.
స్వతంత్ర శాస్త్రవేత్తగా పరిశోధన విస్తృతం చేయడంలో భాగంగా 2024లో డాక్టర్ ఆర్ఎస్ఎస్‌ పరిశోధనా సంస్థను స్థాపించారు. ప్రస్తుతం దాదాపు మూడు లక్షల మంది రైతు సోదరులకు ప్రతిరోజూ ఫోన్ కాల్స్, వాట్సాప్ సందేశాల ద్వారా పండ్ల మొక్కల సమస్యలపై ఎప్పటికప్పుడు ప్రామాణిక విధానాల రూపంలో పరిష్కారాలు తెలియజేస్తున్నారు.
2025లో భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా సిట్రస్‌ మారథాన్‌ తరగతులను హైదరాబాద్‌ నగరంలో నిర్వహించి “డా. ఆర్ఎస్ఎస్‌ సిట్రస్‌ మెటీరియల్‌”ను విడుదల చేశారు. ఇది ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో అత్యంత ఆదరణ పొందిన కరపుస్తకంగా నిలిచింది.
   దేశీ గోశాల ప్రారంభం
2025లో దేశీ గోశాలను ఒక్క ఆవుతో ప్రారంభించి ప్రస్తుతం దాదాపు 30 దేశీ ఆవులను పోషిస్తున్నారు. ఇందులో ప్రధానంగా ఒంగోలు, పుంగనూరు, గిరి, హల్లికర్, ది యోని, మల్లనాడు గిత్త వంటి జాతుల ఆవులు ఉన్నాయి. దేశంలోనే తొలిసారిగా దేశీ గోవుల స్వచ్ఛమైన గోమూత్రంతో అన్ని రకాల పంటల కోసం సూర్యపుత్ర, అగ్నిపుత్ర, భూమి పుత్ర అనే సహజసిద్ధ పిచికారీ మందులను అభివృద్ధి చేశారు.
2024 నుంచి ఇప్పటివరకు అనేక సంస్థల నుంచి సేవా కార్యక్రమాలకు గుర్తింపుగా అవార్డులు, సత్కారాలు పొందడం జరిగింది.
2018 నుంచి 2026 వరకు రైతులకు సూచనలు, సలహాలు అందిస్తూ వస్తున్నారు.
రైతు కోసం యూట్యూబ్‌ వేదికగా వెయ్యికి పైగా పంట వ్యాధి నిర్వహణ తరగతులు
నేటి వ్యవసాయంలో అధికంగా పురుగుమందులు పడుతూ వస్తున్నారు. అయితే ఎరువుల దుకాణ యజమానులు ఎటువంటి అవగాహన లేకుండా రైతులకు ఎరువులు ఇవ్వడంతో రైతులకు లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉండటం గ్రహించి, రైతులు నష్టపోకుండా ఉండాలన్నదే తన ఏకైక లక్ష్యంగా పెట్టుకుని యూట్యూబ్‌ ద్వారా ఏ రోగానికి ఏ మందు పిచికారీ చేయాలి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి భూములు ఎలా సారం పెంచాలి అని రైతులకు తెలియజేస్తూ ఎరువుల వినియోగంలో శాస్త్రీయ పద్ధతులను పాటించాలని ఆయన యూట్యూబ్‌ ద్వారా రైతులకు వివరిస్తున్నారు.
చిన్న, పేద రైతుల మేలు కోసం అండగా
చిన్న మరియు పేద రైతుల సమస్యలను దగ్గర నుంచి తెలుసుకుని, వారికి అవసరమైన శాస్త్రీయ అవగాహన, సాగు సలహాలు, ప్రామాణిక విధానాలను ఎలాంటి ఖర్చు లేకుండా అందిస్తూ అండగా నిలుస్తున్నారు. రైతులు నష్టాల్లో కాకుండా లాభాల దిశగా సాగేందుకు మార్గనిర్దేశం చేస్తూ, వారి జీవనోపాధి మెరుగుదలకు నిరంతరం కృషి చేస్తున్నారు.
ఆచరణే ఆయుధం.. వేలాదిమందికి స్ఫూర్తిగా డా. ఆర్ఎస్ఎస్‌
రైతులు, యువత, సమాజ అభివృద్ధి అనే త్రిసూత్రాన్ని ఆలోచనగా కాకుండా ఆచరణగా మలుచుకుని ముందుకు సాగుతున్న డా. ఆర్ఎస్ఎస్‌ తన కృషితో ఎందరో మందికి దారి చూపే మార్గదర్శిగా నిలిచారు. మాటలకన్నా పనితోనే తన స్థాయిని నిరూపిస్తూ వేలాదిమందికి స్ఫూర్తిగా మారారు.