డ్రగ్స్ వద్దు.. చదువులే ముద్దు
అనంతపురం బ్యూరో
డ్రగ్స్ వద్దు.. చదువులే ముద్దు
అనంతపురం, సెప్టెంబర్ 27:
స్వాతంత్ర్య సమరయోధుడు భగత్‌సింగ్ జయంతిని పురస్కరించుకుని భారత విద్యార్థి ఫెడరేషన్ (SFI) ఆధ్వర్యంలో అనంతపురం నగరంలో ‘డ్రగ్స్ వద్దు.. చదువులే ముద్దు’ అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ వైద్యుడు డాక్టర్ బాలాజీ హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, డ్రగ్స్ వినియోగం వల్ల ఆరోగ్యం, విద్య, భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని అవగాహన కల్పించారు. యువత తమ సమయాన్ని చదువులు, క్రీడలు, సామాజిక కార్యక్రమాలపై కేంద్రీకరించి భవిష్యత్తుకు మంచి బాటలు వేసుకోవాలని సూచించారు.
భగత్‌సింగ్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని విద్యార్థులు సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరించాలని కార్యక్రమ నిర్వాహకులు పిలుపునిచ్చారు. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా విద్యార్థుల్లో చైతన్యం తీసుకురావడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు.