చీమకుర్తి కాలువ ప్రారంభోత్సవానికి భారీగా తరలిరావాలి
కూటమి శ్రేణులు, రైతులు పెద్దసంఖ్యలో పాల్గొనాలి
ఏర్పాట్లపై ఎమ్మెల్యే బి.ఎన్. విజయ్‌కుమార్ సమీక్ష
ఒంగోలు,మేజర్ న్యూస్ :
కాలువ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సంతనూతలపాడు ఎమ్మెల్యే బి.ఎన్. విజయ్‌కుమార్ కూటమి నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సోమవారం చీమకుర్తిలో జరగనున్న మేజర్ కాలువ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు హాజరుకానున్న నేపథ్యంలో ఆదివారం ఒంగోలు మంగమూరు రోడ్డులోని సంతనూతలపాడు ఎమ్మెల్యే కార్యాలయంలో చీమకుర్తి మండల, పట్టణ ముఖ్య నాయకులతో సభ ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బి.ఎన్. విజయ్‌కుమార్ మాట్లాడుతూ చీమకుర్తి మండలం, పట్టణం నుంచి కూటమి నాయకులు, కార్యకర్తలు, రైతులు భారీగా తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నాయకులను ఆదేశించారు. మంత్రి నిమ్మల రామానాయుడు చేతుల మీదుగా జరిగే కాలువ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రజలు పెద్దసంఖ్యలో హాజరయ్యేలా నాయకులు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని సూచించారు. సమావేశంలో ఏఎంసీ చైర్మన్ మన్నం ప్రసాద్, పార్లమెంట్ ఉపాధ్యక్షులు గొల్లపూడి సుబ్బారావు, మండల పార్టీ అధ్యక్షులు గొట్టిపాటి రాఘవరావు, ముప్పురి చలమయ్య, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ కూనంనేని లోకేష్, మండల సెక్రటరీలు ఇస్తార్ల ఏడుకొండలు, అవనిగడ్డ శేషయ్య, క్లస్టర్ ఇన్‌చార్జి కాట్రగడ్డ రమణయ్య, మన్నం శేషయ్యతో పాటు మండల, గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు.