ఎస్ఐఆర్ ప్రక్రియపై క్షేత్రస్థాయి పరిశీలన
అనంతపురం బ్యూరో
ఎస్ఐఆర్ ప్రక్రియపై క్షేత్రస్థాయి పరిశీలన
అనంతపురం, సెప్టెంబర్ 27:
జిల్లా ఎలక్టోరల్ రోల్ అబ్జర్వర్, ఆంధ్రప్రదేశ్ మిషన్ ఫర్ క్లీన్ కృష్ణ గోదావరి కెనాల్స్ మేనేజింగ్ డైరెక్టర్ జి.సి. కిషోర్ కుమార్ ఐఏఎస్ ఆదివారం జిల్లాలో క్షేత్రస్థాయిలో పర్యటించారు. జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఓ. ఆనంద్‌తో కలిసి అనంతపురం రూరల్ పరిధిలోని ఏ.నారాయణపురం-2 స్వర్ణ గ్రామ సచివాలయం, విద్యారణ్యనగర్, పాపంపేట జెడ్పీ ఉన్నత పాఠశాలల్లో ఎస్ఐఆర్-2026లో వచ్చిన క్లెయిమ్స్, అభ్యంతరాలపై పరిశీలన చేపట్టారు.
ఈ సందర్భంగా బీఎల్‌ఓలను ఎస్ఐఆర్ ప్రక్రియ, ఫారం-6, 7, 8, బీఎల్‌ఓ యాప్ తదితర అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. విధులపై అవగాహనతో పనిచేస్తున్న బీఎల్‌ఓలను అభినందించి, ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తయ్యే వరకు అప్రమత్తంగా పనిచేయాలని సూచించారు. క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకుని పరిష్కార మార్గాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీఓ ప్రేమంత్ కుమార్, ఈఆర్‌ఓ వెంకటనారాయణ, తహసీల్దార్ రాజా, ఏఈఆర్‌ఓ, ఎంపీడీఓ దివాకర్, బీఎల్‌ఓలు తదితరులు పాల్గొన్నారు.