BREAKING
పడాలలో వైసీపీ ఎన్నికల సన్నాహక కార్యక్రమం ఓటీటీలోకి రానున్న మమితా బైజు సూపర్ హిట్ సినిమా: స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ హంద్రీనీవా ఉపకాలువకు నిధులు కేటాయించాలి శశి వాకర్స్‌ గ్రౌండ్‌లో స్వచ్ఛతా సేవ బిగ్ బాస్ హౌస్‌లో త్రిగుణ్, అమన్ మధ్య తీవ్ర వాగ్వాదం: మిథిలేష్ ఎగ్జిట్‌తో రంజుగా మారిన ఆట శ్రీఆదిత్య మహిళా డిగ్రీ కళాశాలలో ప్రపంచ పర్యాటక దినోత్సవం విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడొద్దు ఏఐఎస్ఎఫ్ ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ నిలిపివేయాలి: ఎస్‌ఎఫ్‌ఐ బాక్సాఫీస్ వద్ద హనుమాన్ అంశ్ సంచలనం: రూ. 400 కోట్ల కలెక్షన్ల దిశగా ఆధ్యాత్మిక చిత్రం ఎన్టీఆర్ డ్రాగన్ సినిమా షూటింగ్ అప్‌డేట్: బాలీవుడ్ హీరో ఎంట్రీతో క్రేజ్ మోదీ ‘మన్ కీ బాత్’ వీక్షించిన శ్రీనివాస వర్మ - భారత జట్టులో చాకలి శేరిపల్లి బిడ్డకు ఘన సత్కారం. తెలంగాణకు మరో ఆణిముత్యం కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మను కలిసిన భీమవరం మీడియా క్లబ్ ప్రతినిధులు ఎస్.ఎస్. రాజమౌళి సినీ ప్రస్థానానికి 25 ఏళ్లు: టాలీవుడ్ స్థాయిని ప్రపంచానికి చాటిన దిగ్గజ దర్శకుడు రామాయణ మూవీ ట్రైలర్ విడుదల.. రాముడిగా రణ్‌బీర్ కపూర్, రావణాసురుడిగా యశ్ అరిపించేశాయ్

హాస్టల్‌లో పరిశుభ్రతకు పెద్దపీట

Select Suryaa Now
హాస్టల్‌లో పరిశుభ్రతకు పెద్దపీట

విద్యార్థినులతో మాట్లాడి చదువులు, భవిష్యత్ లక్ష్యాలపై ఆరా
నాణ్యమైన ఆహారం అందించాలని అధికారులకు ఆదేశం
సూర్య ప్రతినిధి, ఒంగోలు : 

ఒంగోలు భాగ్యనగర్‌లోని ప్రైవేట్ భవనంలో కొనసాగుతున్న ప్రభుత్వ సాంఘిక సంక్షేమ కాలేజ్ గర్ల్స్ హాస్టల్‌ ను జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి ఎన్. లక్ష్మానాయక్ ఆదివారం ఉదయం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థినులతో ముఖాముఖిగా మాట్లాడి వారి చదువులు, విద్యాపరమైన ప్రతిభ, భవిష్యత్ లక్ష్యాలపై ఆరా తీశారు. అనంతరం హాస్టల్‌లోని వంటగది, స్టోర్‌ రూమ్‌ను పరిశీలించారు. నిర్దేశిత మెనూలో భాగంగా తయారు చేసిన పూరీ, ఆలూ కుర్మాను విద్యార్థినులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. వంటగది, స్టోర్‌ రూమ్‌తో పాటు హాస్టల్‌ ప్రాంగణంలో పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, ఎలాంటి లోపాలు లేకుండా నిర్వహించాలని హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ కె. స్వప్నలతను ఆదేశించారు. నిర్దేశిత మెనూ ప్రకారం ప్రతిరోజూ నాణ్యమైన ఆహారం అందించేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు.