నిమజ్జనాల తర్వాత హైదరాబాద్‌లో ముమ్మర పారిశుద్ధ్య డ్రైవ్
హైదరాబాద్: గణేష్ నిమజ్జనాల నేపథ్యంలో నగరంలో పారిశుద్ధ్య పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. నిమజ్జన పాయింట్లు, ఊరేగింపు మార్గాల్లో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించే పనులను అధికారులు వేగవంతం చేశారు.
మూడు షిఫ్టుల్లో 15 వేల మంది పారిశుద్ధ్య సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. హుస్సేన్‌సాగర్ చుట్టూ భారీగా పేరుకుపోయిన చెత్తను తొలగిస్తున్నారు. రెండు రోజుల్లో మూడు కార్పొరేషన్ల పరిధిలో అదనంగా 13 వేల మెట్రిక్ టన్నుల చెత్త పేరుకుపోయినట్లు అధికారులు వెల్లడించారు.
పేపర్ షార్ట్స్ కారణంగా చెత్త తొలగింపులో పారిశుద్ధ్య సిబ్బందికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రోడ్లపై సేకరించిన వ్యర్థాలను ప్రత్యేక వాహనాల ద్వారా తరలిస్తున్నారు. జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో సేకరించిన చెత్తను జవహర్‌నగర్ డంపింగ్ యార్డుకు తరలించే ప్రక్రియ కొనసాగుతోంది.