యువ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో తోక్క్వాండో కలర్ బెల్ట్ టెస్ట్
యువ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో తైక్వాండో కలర్ బెల్ట్ టెస్ట్
పులివెందుల మేజర్ న్యూస్:
యువ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఆదివారం తైక్వాండో కలర్ బెల్ట్ టెస్ట్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ కమిషనర్ శ్రీమతి తనూజా, మాస్టర్ శివ, విస్డం వ్యాల్యూ స్కూల్ ప్రిన్సిపల్ శ్వేత హాజరై విద్యార్థులను ప్రోత్సహించారు.
ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ స్థాయిల బెల్ట్ పరీక్షల్లో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, శారీరక దృఢత్వం, ఆత్మరక్షణ నైపుణ్యాలను పరీక్షించారు.
అతిథులు మాట్లాడుతూ, చిన్న వయస్సు నుంచే క్రీడలు, మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ పొందడం వల్ల విద్యార్థుల్లో ధైర్యం, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలను క్రీడల వైపు ప్రోత్సహించాలని సూచించారు.