BREAKING
ప్రకృతి వ్యవసాయంపై ఇండోనేషియా శాస్త్రవేత్తల బృందం పర్యటన పాలన మరిచి తిట్లతో కాలం గడుపుతున్న కాంగ్రెస్ నాయకులు కల్తీ భయం లేకుండా ఇంట్లోనే స్వచ్ఛమైన కొబ్బరి నూనె తయారు చేసుకోండిలా.. టీడీపీలో చేరిన మంగళగిరి నియోజకవర్గ వైసీపీ నేతలు గీతాంజలి విద్యాలయం లో భగత్‌సింగ్ జయంతి వేడుకలు నేపాల్‌ను ముంచెత్తిన ప్రకృతి బీభత్సం టీడీపీలో చేరిన వైసీపీ కార్యకర్తలు శ్రీ ప్రకాశం మున్సిపల్ హైస్కూల్‌లో చిత్రలేఖనం, వక్తృత్వ పోటీలు 28వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి అగ్గారపు శ్రీనివాసులు ఇంటింటి ప్రచారం అప్పుల బాధతో కూలీ ఆత్మహత్య యువత భవితకు భరోసా కార్యక్రమంలో ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ ప్రమాదవశాత్తు కింద పడి వ్యక్తి మృతి మోడల్ సోలార్ విలేజ్ పోటీకి ఐదు గ్రామాలు మదర్ డెయిరీ డైరెక్టర్ గా చీర లావణ్య మహిపాల్ విజయం కూటమి పాలనతోనే రాష్ట్రానికి శ్రీరామరక్ష

పూర్వ విద్యార్థుల సమ్మేళనం-మూడు దశాబ్దాల తర్వాత మిత్రుల కలయిక

Select Suryaa Now
పూర్వ విద్యార్థుల సమ్మేళనం-మూడు దశాబ్దాల తర్వాత మిత్రుల కలయిక
సూర్య కాల్వ శ్రీరాంపూర్ మూడు దశాబ్దాల విరామం... మారిన రూపాలు.. మారిన జీవితాలు.. కానీ చెక్కుచెదరని స్నేహబంధం. చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ పూర్వ విద్యార్థులు ఒకే వేదికపై కలుసుకోవడంతో కాల్వ శ్రీరాంపూర్‌లో సందడి నెలకొంది.మండల కేంద్రంలోని కేజీఎన్‌ ఫంక్షన్‌ హాల్‌లో స్థానిక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో 1994–95లో పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆదివారం ఘనంగా నిర్వహించారు. సుమారు మూడు దశాబ్దాల తర్వాత ఒకరినొకరు కలుసుకున్న మిత్రులు ఆత్మీయంగా పలకరించుకుని, నాటి పాఠశాల రోజుల మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. తమ జీవిత ప్రయాణంలోని అనుభవాలను పరస్పరం పంచుకుంటూ ఆప్యాయతను చాటుకున్నారు.ఆపదలో ఉన్న మిత్రులకు అండగా ఉండాలని చదువు పూర్తయి ఎవరి జీవితాల్లో వారు స్థిరపడినా, స్నేహబంధాన్ని మాత్రం కొనసాగించాలని పూర్వ విద్యార్థులు నిర్ణయించారు. ఇందులో భాగంగా ఒక ట్రస్ట్‌ను ఏర్పాటు చేసి, ఆపదలో ఉన్న మిత్రులకు ఆర్థికంగా, సామాజికంగా అండగా నిలవాలని నిర్ణయించారు. ఇందుకోసం కమిటీని ఏర్పాటు చేసుకున్నారు.పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని ముందుండి నిర్వహించి విజయవంతం చేసిన గోలి శ్రీనివాస్‌, కే. రామచంద్రరెడ్డి, ఓడ్నాల జగన్‌, తోట్ల రవి, బైరి కుమార్‌, మధుకర్‌, శ్రీధర్‌, జనార్దన్‌రెడ్డిలను ఈ సందర్భంగా పలువురు అభినందించారు. మూడు దశాబ్దాల తర్వాత జరిగిన ఈ ఆత్మీయ కలయిక పూర్వ విద్యార్థుల్లో నూతన ఉత్సాహాన్ని నింపింది.