ఎమ్మెల్యే రోషన్‌పై దుష్ప్రచారాన్ని ఖండించిన గ్రామస్తులు
ఎమ్మెల్యే రోషన్‌పై దుష్ప్రచారాన్ని ఖండించిన గ్రామస్తులు
జంగారెడ్డిగూడెం/చింతలపూడి- మేజర్ న్యూస్ ఎమ్మెల్యే రోషన్‌కుమార్‌పై కొందరు వ్యక్తులు, కొన్ని మీడియా సంస్థల ద్వారా తప్పుడు ప్రచారం చేయడాన్ని మల్లాయగూడెం గ్రామస్తులు తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్యే చేస్తున్న అభివృద్ధిని ఓర్వలేకనే ఇలాంటి ప్రచారాలకు పాల్పడుతున్నారని వారు ఆరోపించారు.
తక్కెళ్లపాటి రమేష్ అనే కార్యకర్త మాట్లాడుతూ.. ఓ మీడియా సంస్థ ప్రలోభపెట్టి ఎమ్మెల్యేపై విమర్శలు చేసేలా తనతో మాట్లాడించి, ఆ వ్యాఖ్యలను వక్రీకరించి ప్రసారం చేసి తనను ఇబ్బందులకు గురిచేసిందని పేర్కొన్నారు. దీనిపై ఆయన కౌంటర్ వీడియో విడుదల చేసినట్లు తెలిపారు.
ఎమ్మెల్యే రోషన్‌కుమార్ నియోజకవర్గ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇస్తున్నారని రమేష్ పేర్కొన్నారు. కార్యకర్తల సమస్యలను తెలుసుకుని వారికి అండగా ఉంటున్నారని అన్నారు.
ఎమ్మెల్యేపై తప్పుడు వార్తలు, దుష్ప్రచారాలు చేయడం సరికాదని గ్రామస్తులు పేర్కొన్నారు. ఇలాంటి ప్రచారాలు కొనసాగితే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
రమణ రావు జంగారెడ్డిగూడెం