జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి
సూర్య జగిత్యాల ప్రతినిధి: తెలంగాణ సాయుధ పోరాటంలో ధైర్యసాహసాలతో పోరాడి, ప్రజల హక్కులు, సామాజిక న్యాయం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన వీర వనిత చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను జగిత్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమం లో చాకలి ఐలమ్మ చిత్రపటానికి అదనపు ఎస్పీ చేతన్ నితిన్ పోలీస్ అధికారులు సిబ్బంది పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఏవో శ్రీనివాస్, ఆర్.ఐ. వేణుతో పాటు జిల్లా పోలీస్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.