లబ్ధిదారులకు చెక్కుల పంపిణి....
సూర్య కమ్మర్ పల్లి
మండలంలోని హసాకొ త్తూర్ గ్రామంలో సిఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం గ్రామ శాఖ అధ్యక్షుడు ఎడ్ల శ్రీకాంత్ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ వద్ద పంపిణీ చేయడం జరిగినది.15 లబ్ధిదారులకు సుమారు మూడు లక్షల రూపాయల చొప్పున చెక్కులను పంపిణి చేయడం జరిగినది.ఈ సందర్బంగా కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ ఎడ్ల శ్రీకాంత్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోగ్యం బాగు లేక హాస్పిటల్లో చికిత్స నిమిత్తం వెళ్లిన నిరు పేదవాళ్ళకి ఎంతో అండగా ఉండి హాస్పిటల్ చికిత్స ఖర్చు డబ్బుని సీఎం సంక్షేమ నిధి నుండి పేదవాళ్లకు ఇవ్వడం వలన తిరిగి మళ్ళీ ఆరోగ్యాన్ని కాపాడులోవడంలో ఎంతో మేలు జరుగుతుంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నలిమెల గంగారెడ్డి ఉపసర్పంచ్ ఏనుగు మనోహర్, జిల్లా నాయకులు పడిగల ప్రవీణ్,నాయకులు కుందేటి శ్రీనివాస్, గోపిడిలింగారెడ్డి,చిన్నమౌలా శ్రీనివాస్,కుమ్మరి,సాయన్న,ఎదుల రాజేందర్,మండపల్లి మహేందర్, గోపిడి రాజేశ్వర్, దాశ రాజేశ్వర్ లు తదితరులు పాల్గొన్నారు..