BREAKING
కేసీఆర్‌ ప్రజల గుండెల్లో ఉన్నారు.. రెండేళ్లలో మళ్లీ మా పాలనే: కేటీఆర్‌ యూట్యూబ్‌ను ఊపేస్తున్న బంగులా ఫోక్ సాంగ్: రెండే రోజుల్లో రికార్డు వ్యూస్‌తో ట్రెండింగ్ బాధిత కుటుంబాలను పరామర్శించిన చెరుకు శ్రీనివాస్ రెడ్డి. రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం ..... రైతుల పక్షపాతి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు --కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పూర్వ విద్యార్థుల సమ్మేళనం-మూడు దశాబ్దాల తర్వాత మిత్రుల కలయిక శక్తి స్వరూపిణి పోలేరమ్మ తల్లి జాతర వైభవానికి వేళాయె -పొదలకూరు పోలేరమ్మ తల్లి జాతరకు మంత్రి ఆనంకు ఆహ్వానం! చిన్న వెంకన్న మండలంలోని రోడ్లు నిర్మాణానికి 9 కోట్ల రెండు లక్షల రూపాయలు నిధులు మంజూరు ఎమ్మెల్యే మద్దిపాటి భావితరాలకు మనం ఇచ్చే సంపద చెట్లే.. -నరుకూరులో మొక్కలు నాటిన టీడీపీ యువనేతలు సోమిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, శృతి.. శ్రీవారి నిత్యాన్నదాన పథకానికి రూ.3,00,000/లు విరాళం వైసీపీ వి చీప్ పాలిటిక్స్-మంత్రి నారాయణ. ఓటీటీలోకి సునీల్ సూపర్ హిట్ మలయాళ యాక్షన్ థ్రిల్లర్: ఆహాలో స్ట్రీమింగ్ కాట్టాలన్ ప్రకృతి పరిరక్షణతోనే ఆరోగ్యకరమైన సమాజం ఎమ్మెల్యే రోషన్‌పై దుష్ప్రచారాన్ని ఖండించిన గ్రామస్తులు రణబాలి సినిమాకు ముందు డాక్యుమెంటరీ విడుదల: చిత్ర యూనిట్ కీలక నిర్ణయం డైమండ్స్ లయన్స్ ఆధ్వర్యంలో గొడుగులు పంపిణీ

రేవంత్ రెడ్డి కంటపడింది.. సిరిసిల్ల ప్రజల పంట పండింది!

Select Suryaa Now
రేవంత్ రెడ్డి కంటపడింది.. సిరిసిల్ల ప్రజల పంట పండింది!

 

​రేవంత్ రెడ్డి కంటపడింది.. సిరిసిల్ల ప్రజల పంట పండింది!

​సూర్య రాజన్న సిరిసిల్ల:

​ఈ నెల 30న ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సిరిసిల్ల పర్యటన నేపథ్యంలో పట్టణంలో నిర్వహించిన పార్టీ సన్నాహక సమావేశంలో రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిళ్ల శ్రీధర్ బాబు పాల్గొని దిశానిర్దేశం చేశారు. ముఖ్యమంత్రి దృష్టి పడడంతోనే సిరిసిల్ల ప్రాంతానికి అభివృద్ధి, సంక్షేమం వరదలా కొనసాగుతోందని వారు పేర్కొన్నారు. గత ప్రభుత్వం బకాయి పెట్టిన 370 కోట్ల రూపాయలకు పైగా నిధులు విడుదల చేయడంతో పాటు 6 కోట్ల 30 లక్షల మీటర్ల ఇందిరమ్మ చీరల తయారీ ఒప్పందాన్ని అందించి నేత కార్మికులను ఆదుకున్నామని తెలిపారు. అలాగే వేములవాడ రాజన్న ఆలయానికి 250 కోట్ల రూపాయలు, సమీకృత గురుకుల పాఠశాలలను మంజూరు చేసినట్లు వివరించారు. ముఖ్యమంత్రి తొలిసారి సిరిసిల్లకు వస్తున్నందున నిర్వహించే బహిరంగ సభను లక్ష మందితో విజయవంతం చేసి కార్మికులు తమ సంఘీభావం తెలపాలని, భవిష్యత్తులో ఈ ప్రాంతంలో కాంగ్రెస్ జెండా ఎగురవేయడానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని మంత్రులు పిలుపునిచ్చారు.