BREAKING
గోదావరి భవనం నందు జాయింట్ కలెక్టర్ నిదియా దేవికి చాంబర్ ఆఫ్ కామర్సు నాయకులు వినతి పత్రం.. తిరుమలలో ఘనంగా నవరాత్రి బ్రహ్మోత్సవాలు.. పెద్దశేష వాహనంపై శ్రీ మలయప్ప కనువిందు రూ 25 లక్షలు తో పినపల్ల లో అభివృద్ధి పనులు తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌ను కలిసిన విజయ్ దేవరకొండ, రష్మిక.. సినిమాపై ప్రశంసల జల్లు! టీచర్స్ ఓటు పొందుటకు దరఖాస్తు చేసుకోవాలి ఓడలరేవు గ్రామానికి ఓఎన్జీసీ నిధులు విడుదల చేయాలి.. టీ, కాఫీలు ఎక్కువగా తాగుతున్నారా.. అయితే ఈ అనారోగ్య సమస్యలు తప్పవు! అందరూ సహకరిస్తేనేస్వచ్ఛత దసరా బాక్సాఫీస్ రేసులో 'రణబాలి' మరియు 'జైలర్ 2'.. పండగ విన్నర్ ఎవరో తేలేదిప్పుడే! ప్రజా సేవే లక్ష్యంగా ప్రజలకు సేవ చేయాలి :మానవత అధ్యక్షులు రామచంద్రారెడ్డి పిలుపు. రైతులకు సరిపడా ఎరువులు అందించాలి.* *పెంచిన ఎరువుల ధరలు తగ్గించాలి.* *ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో రంగాపురంలో రైతులు ధర్నా..* పార్టీ అవకాశం ఇస్తే పోటీకి సిద్ధం :కడియం జడ్పీటీసీ బరిలో ఆదిమూలం సాయిబాబా! అత్తిలిలో రూ.15.94 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం డయాలసిస్ కేంద్రం ప్రారంభం.. ఎనిమిది పంచాయతీరాజ్ రహదారులకు శంకుస్థాపన ధారూర్ ఎస్‌ఐగా సురేష్ బాధ్యతల స్వీకరణ ఇంట్లో వైభవంగా దసరా నవరాత్రి పూజలు.. ప్రత్యేక ఫోటోలు పంచుకున్న దిల్ రాజు భార్య తేజస్విని!

వైభవంగా కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు

Select Suryaa Now
వైభవంగా కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు

జిహెచ్ఎంసి జల్ పల్లి సర్కిల్ పరిధి, మామిడిపల్లి శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని రెండవ రోజు సోమవారం వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య ధ్వజారోహణం, అగ్ని ప్రతిష్ట, ఆవాసనం కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. సాయంత్రం విష్ణు సహస్రనామ పారాయణం, దేవత ఆహ్వాన కార్యక్రమాలు నిర్వహించారు. 13న మంగళవారం ఉదయం 11గంటలకు స్వామివారి తిరు కళ్యాణం జరగనుందని, ఈ వేడుకలకు వివిధ రాజకీయ నాయకులు, మామిడిపల్లి గ్రామ పెద్దలు, నగర శివారు  ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున హాజరవుతారని ఆలయ చైర్మన్ కళ్లెం నరేష్ గౌడ్ తెలిపారు. ఈ కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి స్వామివారి కల్యాణాన్ని వీక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఈఓ మురళీకృష్ణ, ఆలయ కమిటీ సభ్యులు చీమలదారి చెన్నయ్య, గొండ్యాల శేఖర్ ముదిరాజ్, ఎలిగపల్లి అనిత, కానుగుల భాస్కర్, గుర్జని రాధిక, అర్చకులు ఉండేకారి సుధీర్ కుమార్, నాయకులు లాల్ సతీష్ గౌడ్, విజయ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.                 

-అంకం జగన్ : మేజర్ న్యూస్, జల్ పల్లి.