పార్టీ అవకాశం ఇస్తే పోటీకి సిద్ధం :కడియం జడ్పీటీసీ బరిలో ఆదిమూలం సాయిబాబా!
కడియం, మేజర్ న్యూస్,కడియం జడ్పీటీసీ స్థానం ఓసీ జనరల్‌కు కేటాయించనున్నట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో కూటమి తరఫున పోటీ చేసేందుకు ఆశావహులు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకుడు ఆదిమూలం సాయిబాబా తనకు పార్టీ అవకాశం కల్పిస్తే పోటీకి సిద్ధమని ప్రకటించారు.
ఈ మేరకు సోమవారం ప్రకటన విడుదల చేశారు.1985 నుంచి రాజకీయాల్లో కొనసాగుతున్న తాను, దివంగత మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహనరావుకు ముఖ్య అనుచరుడిగా పనిచేశానని తెలిపారు. 1998లో గిరజాల వెంకటస్వామి నాయుడు బీజేపీ ఎంపీగా విజయం సాధించడంలోనూ కీలక పాత్ర పోషించానని పేర్కొన్నారు.
గత 15 సంవత్సరాలుగా రాజమహేంద్రవరం ఎల్‌ఐసీ అధ్యక్షుడిగా, పదేళ్లుగా సింగర్స్ ఫ్రెండ్స్ సొసైటీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికవుతున్నానని వెల్లడించారు. 2008లో చిరంజీవిపై అభిమానంతో ప్రజారాజ్యం పార్టీలో చేరి, అనంతరం జనసేనలో కొనసాగుతున్నానని తెలిపారు.
గత ఎన్నికల్లో ఒత్తిళ్లు ఎదురైనా జనసేన అభ్యర్థి విజయానికి కృషి చేశానని, ఇప్పటివరకు పదవులను ఆశించలేదని సాయిబాబా పేర్కొన్నారు. అభిమానులు, గ్రామస్తుల కోరిక మేరకు కడియం జడ్పీటీసీగా పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, మంత్రి కందుల దుర్గేష్ అవకాశం కల్పిస్తే పోటీకి సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు