BREAKING
యే ప్రేమ్ మోల్ లియాలో అనుపమ్ ఖేర్ నటనకు కన్నీళ్లు పెట్టుకున్న మహేశ్ భట్.. భావోద్వేగ లేఖ ఏడవకపోతే రూ. కోటి.. ఏడిస్తే రూ. లక్ష.. అల్లు అరవింద్‌తో ఖరీదైన బెట్ ఓడిపోయిన సుకుమార్ వృషకర్మ వర్సెస్ అలియాస్ రుక్మిణి.. డిసెంబర్ 4 బాక్సాఫీస్ పోరులో గెలిచేదెవరు వేములవాడలో ఆధునిక పోస్టాఫీస్ భవన నిర్మాణానికి కృషి చేస్తా - బండి సంజయ్ కుమార్ హామీ దొడగట్ట సర్పంచ్ రామాంజినేయులు కు ఘనంగా సన్మానం.. అలియాస్ రుక్మిణిపై నాని సంచలన వ్యాఖ్యలు.. అలా అనిపించకపోతే సినిమాలు మానేస్తా పసిడి ప్రియులకు ఊరట.. స్థిరంగా బంగారం, వెండి ధరలు.. నేడు తులం రేటు ఎంతంటే బిగ్ బాస్ తెలుగు 10 నుంచి టెంపర్ వంశీ ఎలిమినేషన్.. 12 వారాలకు రెమ్యునరేషన్ ఎంతంటే డిసెంబర్ 1న వికారాబాద్‌కు తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా రాక అచ్చంపేట ఎస్సీ రిజర్వేషన్ మరో 25 ఏళ్లు కొనసాగించాలి వత్సవాయిలో ప్రారంభమైన రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి రామ్ చంద్రారెడ్డి ఇంట విషాదం.. భార్య అనసూయ కన్నుమూత వెల్దుర్తి రాజకీయాల్లో అభివృద్ధి మేనిఫెస్టో హాట్ టాపిక్ ​తాగునీరు, డ్రైనేజీ, రవాణా, ఉపాధికి ప్రాధాన్యత ​మేనిఫెస్టో విడుదల చేసిన మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ మూడు దశాబ్దాలు గడిచిన చెరిగిపోని వైద్య సేవల జ్ఞాపకం జిల్లా కలెక్టరేట్ లో సోమవారం నాటి ప్రజావాణి రద్దు

రైతులకు సరిపడా ఎరువులు అందించాలి.* *పెంచిన ఎరువుల ధరలు తగ్గించాలి.* *ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో రంగాపురంలో రైతులు ధర్నా..*

Select Suryaa Now
రైతులకు సరిపడా ఎరువులు అందించాలి.*   *పెంచిన ఎరువుల ధరలు తగ్గించాలి.*   *ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో రంగాపురంలో రైతులు ధర్నా..*

లింగపాలెం (రంగాపురం) సూర్య న్యూస్: యాప్ ద్వారా ఎరువుల అమ్మకాల్లో వస్తున్న రైతుల ఇబ్బందులను వెంటనే తొలగించాలని, రైతులకు అవసరమైన సరిపడా ఎరువులు అందించాలని, పెంచిన ఎరువుల ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో లింగపాలెం మండలం రంగాపురంలో సోమవారం రైతులు ధర్నా నిర్వహించారు. స్థానిక సత్యశ్రీ కళ్యాణ మండపం వద్ద ఎరువుల యాప్ పై వ్యవసాయ శాఖ నిర్వహించిన అవగాహన సదస్సు వద్ద వ్యవసాయ శాఖ ఏడి సుబ్బారావు, మండల వ్యవసాయ అధికారులకు వినతి పత్రం అందజేశారు.యాప్ ద్వారా ఎరువులు అమ్మకాలు వలన ఎరువులు అందక నష్టపోతున్నామంటూ రైతులు నినాదాలు చేశారు.ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె. శ్రీనివాస్, కోకో రైతుల సంఘం జిల్లా నాయకులు మోరంపూడి సుబ్రహ్మణ్యం, రైతులు ఓబిలినేని రామచంద్రం, బొల్లిన శ్రీనివాసరావు మాట్లాడుతూ రైతులు ఎంతో కష్టపడి పంటలు పండిస్తుంటే సరిపడా అవసరమైన ఎరువులు అందించకపోవడం వలన చాలా ఇబ్బందులు పడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. యాప్ ద్వారా కొనుగోలు వలన ఓటీపీలు కూడా తెలియక గంటల తరబడి ఎరువుల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి వస్తోందన్నారు. యూరియా, డిఎపి వంటి ఎరువులు అమ్మకాల్లో సీలింగ్ పెట్టడం వలన రైతులకు సరిపడా అందడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం సబ్సిడీని తగ్గించుకోవడం కోసం ఎరువులు అమ్మకాలు కుదింపులో భాగమేనని చెప్పారు. సకాలంలో ఎరువులు వెయ్యకపోవడం వలన దిగుబడులు తగ్గిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఎల్ నినో ప్రభావం లేకపోతే రైతులు ఎరువులు కోసం రోడ్ల ఎక్కాల్సిన పరిస్థితి వచ్చేదన్నారు. లింగపాలెం మండలంలో  ఆయిల్ పామ్, కోకో, కొబ్బరి, మిర్చి, నాటు పొగాకు, మొక్కజొన్న, వరి వంటి పంటలను రైతులు పండిస్తున్నారని, ఈ పంటలకు అవసరమైన ఎరువులు ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతులు అందించాలని డిమాండ్ చేశారు.పెంచిన ఎరువుల ధరలు రైతులకు భారంగా ఉందని, సాగు ఖర్చులు పెరిగిపోయి నష్టపోవాల్సి వస్తోందన్నారు. పెంచిన ఎరువుల ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ఎరువుల సమస్యలపై గ్రామ గ్రామాన ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఆయా పంటల రైతులు గరిమెళ్ళ సత్యనారాయణ, పాకలపాటి సుబ్బారావు, జి.శివన్నారాయణ, బీవీ రత్తయ్య, ఎన్.శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

 పసుమర్తి రాము జిల్లా ఇంచార్జ్ ఏలూరు