BREAKING
యే ప్రేమ్ మోల్ లియాలో అనుపమ్ ఖేర్ నటనకు కన్నీళ్లు పెట్టుకున్న మహేశ్ భట్.. భావోద్వేగ లేఖ ఏడవకపోతే రూ. కోటి.. ఏడిస్తే రూ. లక్ష.. అల్లు అరవింద్‌తో ఖరీదైన బెట్ ఓడిపోయిన సుకుమార్ వృషకర్మ వర్సెస్ అలియాస్ రుక్మిణి.. డిసెంబర్ 4 బాక్సాఫీస్ పోరులో గెలిచేదెవరు వేములవాడలో ఆధునిక పోస్టాఫీస్ భవన నిర్మాణానికి కృషి చేస్తా - బండి సంజయ్ కుమార్ హామీ దొడగట్ట సర్పంచ్ రామాంజినేయులు కు ఘనంగా సన్మానం.. అలియాస్ రుక్మిణిపై నాని సంచలన వ్యాఖ్యలు.. అలా అనిపించకపోతే సినిమాలు మానేస్తా పసిడి ప్రియులకు ఊరట.. స్థిరంగా బంగారం, వెండి ధరలు.. నేడు తులం రేటు ఎంతంటే బిగ్ బాస్ తెలుగు 10 నుంచి టెంపర్ వంశీ ఎలిమినేషన్.. 12 వారాలకు రెమ్యునరేషన్ ఎంతంటే డిసెంబర్ 1న వికారాబాద్‌కు తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా రాక అచ్చంపేట ఎస్సీ రిజర్వేషన్ మరో 25 ఏళ్లు కొనసాగించాలి వత్సవాయిలో ప్రారంభమైన రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి రామ్ చంద్రారెడ్డి ఇంట విషాదం.. భార్య అనసూయ కన్నుమూత వెల్దుర్తి రాజకీయాల్లో అభివృద్ధి మేనిఫెస్టో హాట్ టాపిక్ ​తాగునీరు, డ్రైనేజీ, రవాణా, ఉపాధికి ప్రాధాన్యత ​మేనిఫెస్టో విడుదల చేసిన మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ మూడు దశాబ్దాలు గడిచిన చెరిగిపోని వైద్య సేవల జ్ఞాపకం జిల్లా కలెక్టరేట్ లో సోమవారం నాటి ప్రజావాణి రద్దు

ఓడలరేవు గ్రామానికి ఓఎన్జీసీ నిధులు విడుదల చేయాలి..

Select Suryaa Now
ఓడలరేవు గ్రామానికి  ఓఎన్జీసీ నిధులు విడుదల చేయాలి..

అమలాపురం మేజర్ న్యూస్ :అల్లవరం మండలం ఓడలరేవు గ్రామానికి మంజూరైన నిధులను తక్షణమే విడుదల చేసి, గ్రామాభివృద్ధి పనులు చేపట్టాలని గ్రామ ప్రజలు  ఓఎన్జీసీ అధికారులను కోరుతున్నారు. ఈ మేరకు ఓఎన్జీసీ డైరెక్టర్‌కు గ్రామస్థుల తరఫున విజ్ఞప్తి చేశారు.గ్రామాభివృద్ధి, ఉపాధి కల్పన కోసం 2025 మార్చి 2నగ్రామస్థులందరం కలిసి వివిధ విషయాలపై తమ అభిప్రాయాలను తెలియజేశామని, అనంతరం 2025 ఏప్రిల్ 30న కాకినాడలోని ఈడీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో అప్పటి అల్లవరం గౌరవ శాసనసభ్యులు శ్రీ అయితాబత్తుల ఆనందరావు సమక్షంలో సంప్రదింపులు జరిపామని పేర్కొన్నారు. 

ఆ సమావేశంలో గ్రామాభివృద్ధికి నిధులు కేటాయించి, అభివృద్ధి పనులు చేపడతామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.అయితే, హామీ ఇచ్చి సుమారు 59 రోజులు గడిచినా నిధులు విడుదల కాకపోవడంతో గ్రామస్థులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, ఓడలరేవు గ్రామంలోని ఆఫ్‌షోర్ ప్లాంట్‌లో ప్రైవేటు ఉద్యోగాల ద్వారా గ్రామానికి కొంతమందికి ఉపాధి కల్పించి, మిగిలిన వారికి రెండు, మూడు నెలల్లో ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చినప్పటికీ ఇప్పటివరకు అమలు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇప్పటికైనా ఓఎన్జీసీ అధికారులు స్పందించి,గ్రామాభివృద్ధికి కేటాయించిన నిధులను విడుదల చేయడంతోపాటు స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఓడలరేవు గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.ఈ కార్యక్రమం ఓడలరేవు టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షులు కొల్లు విష్ణుమూర్తి,నాతి వినీల లెనిన్ బాబుమాజీ ఎంపీటీసీపెమ్మడి వెంకట రామారావు,కోప్పడి వెంకట రామ కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.