BREAKING
యే ప్రేమ్ మోల్ లియాలో అనుపమ్ ఖేర్ నటనకు కన్నీళ్లు పెట్టుకున్న మహేశ్ భట్.. భావోద్వేగ లేఖ ఏడవకపోతే రూ. కోటి.. ఏడిస్తే రూ. లక్ష.. అల్లు అరవింద్‌తో ఖరీదైన బెట్ ఓడిపోయిన సుకుమార్ వృషకర్మ వర్సెస్ అలియాస్ రుక్మిణి.. డిసెంబర్ 4 బాక్సాఫీస్ పోరులో గెలిచేదెవరు వేములవాడలో ఆధునిక పోస్టాఫీస్ భవన నిర్మాణానికి కృషి చేస్తా - బండి సంజయ్ కుమార్ హామీ దొడగట్ట సర్పంచ్ రామాంజినేయులు కు ఘనంగా సన్మానం.. అలియాస్ రుక్మిణిపై నాని సంచలన వ్యాఖ్యలు.. అలా అనిపించకపోతే సినిమాలు మానేస్తా పసిడి ప్రియులకు ఊరట.. స్థిరంగా బంగారం, వెండి ధరలు.. నేడు తులం రేటు ఎంతంటే బిగ్ బాస్ తెలుగు 10 నుంచి టెంపర్ వంశీ ఎలిమినేషన్.. 12 వారాలకు రెమ్యునరేషన్ ఎంతంటే డిసెంబర్ 1న వికారాబాద్‌కు తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా రాక అచ్చంపేట ఎస్సీ రిజర్వేషన్ మరో 25 ఏళ్లు కొనసాగించాలి వత్సవాయిలో ప్రారంభమైన రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి రామ్ చంద్రారెడ్డి ఇంట విషాదం.. భార్య అనసూయ కన్నుమూత వెల్దుర్తి రాజకీయాల్లో అభివృద్ధి మేనిఫెస్టో హాట్ టాపిక్ ​తాగునీరు, డ్రైనేజీ, రవాణా, ఉపాధికి ప్రాధాన్యత ​మేనిఫెస్టో విడుదల చేసిన మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ మూడు దశాబ్దాలు గడిచిన చెరిగిపోని వైద్య సేవల జ్ఞాపకం జిల్లా కలెక్టరేట్ లో సోమవారం నాటి ప్రజావాణి రద్దు

ప్రజా సేవే లక్ష్యంగా ప్రజలకు సేవ చేయాలి :మానవత అధ్యక్షులు రామచంద్రారెడ్డి పిలుపు.

Select Suryaa Now
ప్రజా సేవే లక్ష్యంగా ప్రజలకు సేవ చేయాలి :మానవత అధ్యక్షులు  రామచంద్రారెడ్డి పిలుపు.

ఆత్రేయపురం మేజర్ న్యూస్ మనం ఉన్నంతవరకు మంచి పనులు చేయాలని ప్రజా సేవే లక్ష్యంగా ప్రజలకు సేవ చేయాలని  రాష్ట్ర మానవత స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు ఎన్. రామచంద్రారెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు ఆయన సోమవారం ఆత్రేయపురంలో 148 వ మానవత శాఖను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారుఈ సందర్భంగా ఆత్రేయపురం అల్లూరి సీతారామరాజు సెంటర్ లో  జరిగిన ప్రారంభ సభలో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు మనుషులు భగవంతుడు ఇచ్చిన వివేకాన్ని కోల్పోకుండా అహంకారం లేకుండా వినయంతో జీవించాలన్నారు. ప్రతినిత్యం శ్రద్ధతో సాధన చేసి తమ వృత్తులకు న్యాయం చేయాలన్నారు 

తల్లిదండ్రులను దైవ సమానులుగా ఆరాధించాలని వృద్ధాప్యంలో తల్లిదండ్రులకు పట్టెడన్నం పెట్టుకోవాలని  ప్రతి వ్యక్తి ప్రేమతో జీవించాలని, నిస్సహాయులకు చేయూతనందించాలన్నారు ఈ సందర్భంగా  ఆత్రేయపురం శాఖ నూతన అధ్యక్షుడుగా నియమితులైన దండు వెంకట సుబ్బరాజు, కార్యదర్శి వేగేశ్న శ్రీనివాసరాజు, ముదునూరి సోమరాజు, పులవర్తి నాగేశ్వరరావు, పేరూరి నాగేశ్వరరావు, గల్లి వెంకటేశ్వరరావు  ల చేత ప్రమాణ స్వీకారం చేయించారు  ఈ సందర్భంగా ఎన్. రామచంద్ర రెడ్డి, స్థానిక మానవతా అధ్యక్షుడు దండు సుబ్బరాజు, కార్యవర్గాన్ని ముదునూరి బండ కృష్ణరాజు  గొట్టుముక్కల గోపి రాజు లు పూలమాలలు వేసి, శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు

 ఈ కార్యక్రమాలలో మానవతా సంస్థ స్థానిక కోఆర్డినేటర్ గాదిరాజు ప్రసాదరాజు, సెంట్రల్ కమిటీ నేతలు కోడూరి రాధా పుష్పావతి, రామలక్ష్మి, చిట్టూరి సుజాత, సిపి రెడ్డి, వెంకట సూర్యనారాయణ, రామానుజుల రెడ్డి, చంద్రయ్య, కోటేశ్వరరావు, గమిని రాంబాబు, రామిశెట్టి గంగాధరరావు, కాశీ విశ్వనాధ రాజు, శారదా దేవి, రుద్రమదేవి, ధర్మారెడ్డి,తదితరులు మానవతాసంస్థ ఆవశ్యకతపై ప్రసంగించారు కాగా మానవత సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్. రామచంద్రారెడ్డి చేతుల మీదుగా శాంతిరథం, ఫ్రీజర్ బాక్స్  ల ను ఆత్రేయపురం శాఖకు అందజేశారు ఈ కార్యక్రమంలో వాడపల్లి దేవస్థానం చైర్మన్ ముదునూరి వెంకటరాజు మాజీ ఎంపీపీ పిఎస్ రాజు  పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.