BREAKING
సంక్లిష్టమైన ఛాతీ వ్యాధులకు రోబోట్ తో సులభంగా సర్జరీలు *యశోద హాస్పిటల్స్ థొరాసిక్ సర్జన్ డా. రోహన్ రెడ్డి* వల్లభరావుపాలెంలో ఎక్స్‌పోజర్ విజిట్ చేసిన...... మండల ప్రత్యేక అధికారి కె వి వి సత్యనారాయణ ఆధునిక సాంకేతికతతో విద్యుత్ రంగం, సరికొత్త ప్రగతికి సంకేతం. రీ సర్వే తో భూమి సమస్యల పరిష్కారం - ఖమ్మం జిల్లా కలెక్టర్ కోటేకల్‌లో ఘనంగా శ్రీరామ హృదయ కలశం ఊరేగింపు బుల్లెట్ దేవి ప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు. చిన్న తగదాలతో కోర్టులను ఆశ్రయించవద్దు మంగళగిరి నియోజకవర్గం మెల్లెంపూడిలో గ్యార్మీ షరీఫ్ ఉత్సవాలు క్విజ్ లో గోకవరం విద్యార్థి కి ప్రథమ స్థానం వైసీపీ గెలుపుకు అగ్నికుల క్షత్రియులు కృషి చేయాలి భోగాపురంలో మహిళా చట్టాలపై అవగాహన సదస్సు మురుగు నీటితో ఇల్లందు ప్రజల అవస్థలు నాలుగు మధ్య షాపులకు టెండర్లు ఖరారు అద్దంకి సామాజిక ఆరోగ్య కేంద్రం వద్ద మెగా వైద్య శిబిరం న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తక్షణమే అమలు చేయాలి వైయస్సార్సీపీ నేత వడ్డీ రఘురాం

వాయు నాణ్యత మెరుగుదలకు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి మార్గదర్శకాల

Select Suryaa Now
వాయు నాణ్యత మెరుగుదలకు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి మార్గదర్శకాల

 

వాయు నాణ్యత మెరుగుదలకు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి మార్గదర్శకాల మేరకు ఎయిర్ క్వాలిటి మానిటరింగ్ కమిటి ఆధ్వర్యంలో శాస్త్రీయ పర్యవేక్షణ, సమగ్ర కార్యాచరణ

కాలుష్య మూలాల నియంత్రణకు రవాణా, ట్రాఫిక్, మున్సిపల్, వ్యవసాయం, పరిశ్రమలు, పౌర సరఫరాల శాఖల సమన్వయంతో ప్రభావవంతమైన చర్యలు

అటవీ, పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఎయిర్ క్వాలిటి మానిటరింగ్ కమిటి ఛైర్మన్ అహ్మద్ నదీమ్, టిజిపిసిబి మెంబర్ సెక్రటరీ, మెంబర్ కన్వీనర్ రవి ఆధ్యర్యంలో సెక్రటేరయట్ లో సమావేశం

స్వచ్ఛ వాయు సర్వేక్షణలో నల్గొండలోని 16వ వార్డు జాతీయ స్థాయిలో రెండో ర్యాంకు సాధించడం పై హర్షం వ్యక్తం చేసిన కమిటి ఛైర్మన్ అహ్మద్ నదీమ్, మెంబర్ కన్వీనర్ రవి*కాలుష్య మూలాల నిర్మూలనే లక్ష్యంగా టిజిపిసిబి ఆధ్యర్యంలో విస్తృత కార్యక్రమాలు చేపడుతున్నట్లు స్పష్టం చేసిన మెంబర్ సెక్రటరీ రవి

తెలంగాణలో వాయు కాలుష్య నియంత్రణ, వాయు నాణ్యత మెరుగుదల కోసం ఎయిర్ క్వాలిటి మానిటరింగ్ కమిటి(ఎక్యుఎంసి) ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాలు సత్ఫలితాలనిస్తున్నాయని అటవీ, పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అహ్మద్ నదీమ్ అన్నారు. శాస్త్రీయ పర్యవేక్షణ, కాలుష్య మూలాల గుర్తింపు, నియంత్రణ చర్యలు, పచ్చదనం పెంపు, ప్రజా అవగాహన కార్యక్రమాలతో కూడిన సమగ్ర కార్యాచరణను కొనసాగిస్తుండటం అభినందనీయమని పేర్కొన్నారు.  ఈ రోజు సెక్రటేరియట్ లో కమిటి ఛైర్మన్, ప్రిన్సిపల్ సెక్రటరీ అహ్మద్ నదీమ్ గారి ఆధ్వర్యంలో తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి మెంబర్ సెక్రటరీ రవి గారు కమిటి మెంబర్ కన్వీనర్ గా నిర్వహించిన  ఎయిర్ క్వాలిటి మానిటరింగ్ కమిటి సమావేశం కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సిపిసిబి) ఆమోదించిన ఎక్యుఎంసి కార్యాచరణ ప్రణాళికలోని అంశాల పై చర్చించింది.

సీనియర్ ఎన్విరాన్మెంటల్ సైంటిస్ట్, NCAP నోడల్ ఆఫీసర్ ప్రసాద్, జీహెచ్ఎంసి, సైబరాబాద్ మల్కాజ్గిరి కార్పొరేషన్ల కమిషనర్లు, నల్గొండ కలెక్టర్, సిడిఎంఎ అధికారులు, ట్రాన్స్పోర్ట్ కమిషనర్, టిజిఎస్ ఆర్ టిసి, హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి ట్రాఫిక్ కమిషనరేట్ల అధికారులు, టిజి ఐఐసి, వ్యవసాయ, పౌర సరఫరాల శాఖ అధికారులు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, అమలు చేసిన కార్యక్రమాల పై చర్చించిన తర్వాత ఎయిర్ క్వాలిటి మానిటరింగ్ కమిటి ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాలు, ఫలితాలను సమావేశం విశ్లేషించింది. నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ కింద ఎక్యుఎంసి చేపడుతున్న కార్యక్రమాలను సీనియర్ ఎన్విరాన్మెంటల్ సైంటిస్ట్ ప్రసాద్ కమిటి ఛైర్మన్ అహ్మద్ నదీమ్, టిజిపిసిబి మెంబర్ సెక్రటరీ, కమిటి మెంబర్ కన్వీనర్ రవి, కమిటి సభ్యులకు వివరించారు.

ఈ సందర్భంగా సమీక్షించిన అంశాలు -

*PM 10 స్థాయిలపై నిరంతర పర్యవేక్షణ*
2019–20 నుంచి 2025–26 వరకు నమోదైన వార్షిక సగటు PM10 స్థాయిలను పరిశీలిస్తే హైదరాబాద్‌లో 86 నుంచి 80 µg/m³కు, సంగారెడ్డిలో 87 నుంచి 78 µg/m³కు తగ్గుదల నమోదైంది. నల్గొండలో 59 నుంచి 71 µg/m³గా నమోదైంది. 2025–26లో హైదరాబాద్, నల్గొండ, సంగారెడ్డిలో PM10 సగటు స్థాయిలు వరుసగా 80, 71, 78 µg/m³గా నమోదయ్యాయి. వాయు నాణ్యత సూచీ (AQI)  ప్రధానంగా ‘Satisfactory’ నుంచి ‘Moderate’ కేటగిరీలలో ఉన్నట్లు సమీక్షలో నమోదైంది.

వాయు నాణ్యత పర్యవేక్షణ వ్యవస్థ మరింత బలోపేతం
CURE ప్రాంతంలో వాయు నాణ్యతను మరింత ఖచ్చితంగా, నిరంతరంగా పర్యవేక్షించేందుకు 13 ‘నిరంతర పరిసర వాయు నాణ్యత పర్యవేక్షణ వ్యవస్థ (CAAQMS)’ల ఏర్పాటు ప్రక్రియ కొనసాగుతున్నది. పర్యవేక్షణ కేంద్రాల స్థానాలను శాస్త్రీయంగా నిర్ణయించి, ఆయా ప్రాంతాల్లోని వాయు నాణ్యతకు సంబంధించిన కచ్చితమైన సమాచారాన్ని పొందేలా సాంకేతిక కమిటీని ఏర్పాటు చేశారు. 
CAAQMSల నుంచి లభించే డేటాను సమగ్రంగా అందుబాటులోకి తీసుకురావడానికి “ఎయిర్ క్వాలిటి డ్యాష్ బోర్డు” అభివృద్ధి ప్రక్రియ కూడా కొనసాగుతున్నది. సంబంధిత శాఖలకు SMS అలర్ట్ ల ద్వారా వాయు నాణ్యతకు సంబంధించిన సమాచారం చేరవేస్తారు. 
అదేవిధంగా తక్కువ వ్యయంతో వాయు నాణ్యతను పర్యవేక్షించే ‘లో కాస్ట్ సెన్సార్ల (LCS) వినియోగాన్ని కూడా విస్తరిస్తున్నారు. టిజిపిసిబి ఆధ్వర్యంలో బొల్లారం, జీడిమెట్ల ప్రాంతాల్లో ఇప్పటికే 8 LCSలను ఏర్పాటు చేశారు. రీసైక్లింగ్, క్రషింగ్ తదితర కార్యకలాపాలు జరిగే ప్రాంతాల్లో, అలాగే నిర్మాణ, కూల్చివేత ప్రదేశాల్లో LCSల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు.

*‘రోడ్ డస్ట్’ నియంత్రణకు ప్రత్యేక దృష్టి*
పట్టణ వాయు కాలుష్యంలో ధూళికణాల కాలుష్యాన్ని నియంత్రించేందుకు రోడ్ డస్ట్ నియంత్రణకు ప్రాధాన్యత ఇస్తున్నారు. రోడ్ల మెరుగుదల, ఎండ్-టు-ఎండ్ పేవింగ్, మెకానికల్ రోడ్ స్వీపింగ్, బహిరంగ ప్రాంతాల్లో పచ్చదనం పెంపుదల, ట్రాఫిక్ కారిడార్లలో గ్రీన్ కవర్, మినీ ఫారెస్టులు, మియావాకీ ప్లాంటేషన్లు వంటి చర్యలను నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ (NCAP) కింద చేపడుతున్నారు.
మెకానికల్ రోడ్ స్వీపింగ్‌పై టిజిపిసిబి నిర్వహించిన అధ్యయన ఫలితాలను మూడు పట్టణ స్థానిక సంస్థల అధికారులకు వివరించేందుకు వర్క్ షాప్ నిర్వహించగా, సుమారు 100 మంది అధికారులు పాల్గొన్నారు. అధ్యయన సిఫారసులను రాబోయే సర్వీస్ ప్రొక్యూర్‌మెంట్ ప్రక్రియలో పరిగణనలోకి తీసుకోనున్నారు.

*వాహన కాలుష్య నియంత్రణకు చర్యలు*
వాహనాల ఉద్గారాలను తగ్గించేందుకు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం, EV ఛార్జింగ్ మౌలిక వసతుల విస్తరణ, PUC వ్యవస్థ బలోపేతం వంటి చర్యలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ వాహనాల కొనుగోలు, అద్దెకు తీసుకునే వాహనాల్లో EVలకు ప్రాధాన్యత కల్పించే చర్యలు అమలయ్యాయి. 
PUC వ్యవస్థను మరింత సమర్థవంతం చేసేందుకు రాష్ట్రంలోని 516 PUC కేంద్రాలను కేంద్ర సర్వర్‌తో అనుసంధానం చేశారు. ఇప్పటివరకు 36,14,208 పరీక్షలు నిర్వహించినట్లు రవాణా శాఖ నివేదించింది. PUC గడువు ముగిసిన వాహనాలపై ఆటోమేటిక్ చలాన్ల విధానం అమలు చేసేందుకు వాహనాల నంబర్ ప్లేట్లను స్వయంచాలకంగా గుర్తించే (ANPR) కెమెరాల ఏర్పాటుకు కూడా చర్యలు చేపడుతున్నారు.

*ప్రజా రవాణాలో ఎలక్ట్రిక్ బస్సుల వినియోగం పెంపు*
హైదరాబాద్‌లో ప్రజా రవాణా రంగంలో ఎలక్ట్రిక్ బస్సుల వినియోగాన్ని పెంచే చర్యలు కొనసాగుతున్నాయి. TGSRTC ప్రస్తుతం GHMC పరిధిలో 310 ఎలక్ట్రిక్ బస్సులను నడుపుతోంది. అదనంగా ఎలక్ట్రిక్ బస్సుల సంఖ్యను పెంచేందుకు చర్యలు కొనసాగుతున్నాయి. PM E-Drive కింద రాష్ట్రానికి కేటాయించిన ఎలక్ట్రిక్ బస్సులను దశలవారీగా ప్రవేశపెట్టే ప్రక్రియ కూడా కొనసాగుతున్నది.

*కాలుష్య మూలాలను శాస్త్రీయంగా గుర్తించేందుకు కాలుష్య మూలాల అధ్యయనం (Source Apportionment Study)*
నల్గొండ, సంగారెడ్డి ప్రాంతాల్లో Source Apportionment Study (SAS) ద్వారా వాయు కాలుష్యానికి కారకమవుతున్న వివిధ మూలాలను శాస్త్రీయంగా గుర్తించే ప్రక్రియ కొనసాగుతోంది. IIT బాంబే సమర్పించిన డ్రాఫ్ట్ తుది నివేదికను కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి మార్గదర్శకాలకు అనుగుణంగా మరింత మెరుగుపరచేందుకు టిజిపిసిబి, ఇతర నిపుణ సంస్థలు సూచనలు అందించాయి. ఈ అధ్యయన ఫలితాలను భవిష్యత్ కాలుష్య నియంత్రణ చర్యలకు ఉపయోగించనున్నారు.

*రాష్ట్ర స్థాయి ఉద్గరాల సమగ్ర లెక్కింపు (Emission Inventory)కు చర్యలు*
తెలంగాణలో వాయు కాలుష్య నియంత్రణ కోసం స్టేట్ యాక్షన్ ప్లాన్ ను మరింత శాస్త్రీయంగా బలోపేతం చేసేందుకు తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి యునైటెడ్ నేషన్ ఎన్విరాన్ మెంట్ ప్రోగ్రామ్ తో కలిసి ఉద్గారాల సమగ్ర లెక్కింపు (Emission Inventory) పై చర్యలు చేపడుతున్నది. వివిధ శాఖల నుంచి అమలు నివేదికలను సేకరించి, రాష్ట్ర స్థాయి కార్యాచరణను మరింత సమర్థవంతంగా రూపొందించే ప్రక్రియ కొనసాగుతున్నది. అన్ని జిల్లాలకు జిల్లా స్థాయి అమలు కమిటీల పరిధిని విస్తరించే చర్యలు కూడా ప్రతిపాదనలు సమర్పించారు.

*పరిశ్రమలు, డీజిల్ జనరేటర్ సెట్ల ఉద్గారాల నియంత్రణ*
పారిశ్రామిక ప్రాంతాల్లో వాయు నాణ్యత పర్యవేక్షణను బలోపేతం చేయడంతో పాటు, నిర్మాణ ప్రాంతాలు, ఇతర ప్రధాన కాలుష్య ఉత్పత్తి ప్రాంతాల్లో పర్యవేక్షణకు సెన్సార్ వ్యవస్థలను విస్తరిస్తున్నారు.
డీజిల్ జనరేటర్ సెట్ల నుంచి వెలువడే ఉద్గారాలను నియంత్రించేందుకు ఉద్గార నియంత్రణ పరికరాల అదనపు అమరిక (Retrofit Emission Control Devices (RECD) లకు ప్రాధాన్యత ఇస్తున్నారు. సంబంధిత సంస్థలు, పట్టణ స్థానిక సంస్థలు, విద్యుత్ శాఖల సమన్వయంతో RECD అమలుకు చర్యలు చేపట్టాలని సూచించారు.

*బహిరంగ దహనాల పై అవగాహన - వ్యవసాయ అవశేషాల వినియోగానికి కార్యాచరణ*
వ్యవసాయ అవశేషాలను బహిరంగంగా దహనం చేయడం వల్ల వాయు కాలుష్యం పెరగకుండా అవగాహన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. వ్యవసాయ అవశేషాలను బ్రికెట్లు, పెల్లెట్లుగా మార్చి సంప్రదాయ ఘన ఇంధనాలకు ప్రత్యామ్నాయ ఇంధనంగా వినియోగించే అవకాశాలనూ పరిశీలిస్తున్నారు. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో బ్రికెట్ తయారీ యూనిట్ల ఏర్పాటు ఇప్పటికే ప్రారంభమైంది.

*నిధుల వినియోగం – కాలుష్య నియంత్రణ చర్యలకు ప్రాధాన్యత*
NCAP, 15వ ఫైనాన్స్ కమిషన్ కింద విడుదలైన నిధులను నిర్దేశిత వాయు కాలుష్య నియంత్రణ చర్యలకు సమర్థవంతంగా వినియోగించడంపై ఎయిర్ క్వాలిటి మానిటరింగ్ కమిటి (AQMC) ప్రత్యేకంగా సమీక్షించింది. హైదరాబాద్‌లో NCAP కింద విడుదలైన నిధుల్లో 90.27 శాతం, నల్గొండలో 82.5 శాతం, పటాన్‌చెరులో 100 శాతం, సంగారెడ్డిలో 76.43 శాతం వినియోగమైనట్లు సమీక్షలో వెల్లడైంది. 
2026–27 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణలో NCAP కింద నల్గొండకు రూ.4.83 కోట్లు, సంగారెడ్డికి రూ.2.42 కోట్లు, మొత్తం రూ.7.25 కోట్ల నిధులు కేటాయించారు. ఈ నిధులతో రహదారుల మెరుగుదల, పచ్చదనం, ఎలక్ట్రిక్ క్రిమేటోరియంలు తదితర వాయు నాణ్యత మెరుగుదల చర్యలకు వార్షిక కార్యాచరణ ప్రణాళికలు టిజిపిసిబి సిద్ధం చేసింది.

*స్వచ్ఛ వాయు సర్వేక్షణలో తెలంగాణకు గుర్తింపు-కమిటి ఛైర్మన్, మెంబర్ కన్వీనర్ హర్షం*
NCAP దేశవ్యాప్తంగా 130 నగరాల్లో తొలిసారిగా నిర్వహించిన వార్డు స్థాయి స్వచ్ఛ వాయు పర్యవేక్షణ్ లో తెలంగాణకు గుర్తింపు లభించింది. నల్గొండలోని 16వ వార్డు కేటగిరి 3 (10 వేల జనాభా) కింద జాతీయ స్థాయిలో రెండో ర్యాంక్ సాధించి రూ.20 లక్షల పురస్కారం పొందింది.
అదేవిధంగా హైదరాబాద్‌లోని జూబ్లీహిల్ 215వ వార్డు, గన్‌ఫౌండ్రీ 154వ వార్డు, సంగారెడ్డిలోని 31వ వార్డు రాష్ట్ర స్థాయిలో కేటగిరి 1,2,3 కింద అత్యుత్తమ పనితీరు కనబరిచిన వార్డులుగా నిలిచాయి.

*సమన్వయంతో స్వచ్ఛ వాయు లక్ష్య సాధనకు టిజిపిసిబి కృషి - టిజిపిసిబి మెంబర్ సెక్రటరీ రవి*
రవాణా, మున్సిపల్ పరిపాలన, పరిశ్రమలు, ట్రాఫిక్ వ్యవసాయం, పట్టణాభివృద్ధి తదితర శాఖల సమన్వయంతోనే వాయు కాలుష్యానికి దీర్ఘకాలిక పరిష్కారం సాధ్యమని తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి మెంబర్ సెక్రటరీ, కమిటి మెంబర్ కన్వీనర్ రవి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అందుబాటులోకి వస్తున్న రియల్‌టైమ్ వాయు నాణ్యత డేటా, కాలుష్య మూలాల అధ్యయన ఫలితాలు, ఉద్గారాల సమగ్ర లెక్కింపు, శాస్త్రీయ అధ్యయనాలు, ఫీల్డ్ లెవల్ చర్యలను సమన్వయం చేసి కాలుష్య మూలాలను లక్ష్యంగా చేసుకుని టిజిపిసిబి చర్యలు చేపడుతున్నదని తెలిపారు.  
ప్రజల భాగస్వామ్యం, సంబంధిత శాఖల సమన్వయం, శాస్త్రీయ పర్యవేక్షణ, సాంకేతిక పరిజ్ఞానం వినియోగం ద్వారా తెలంగాణలో మెరుగైన వాయు నాణ్యతను సాధించేందుకు తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి నిరంతరం కృషి చేస్తున్నదని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ హైదరాబాద్, సికింద్రాబాద్ లలో సిటి గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ను విస్తరించే దిశగా చర్యలు తీసుకోవాలని కమిటి ఛైర్మన్ అహ్మద్ నదీమ్ సంస్థ అధికారులకు సూచించారు.