ఉత్తమ సేవా అవార్డు అందుకున్న ఉపాధ్యాయుడు రజినీకాంత్
గాంధీ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని లాల్‌బహదూర్ స్టేడియంలో గ్లోబల్ గాంధీ ఫౌండేషన్ - గాంధీ జయంతి ఉత్సవాల సంస్థగా నిర్వహించిన కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు రజనీకాంత్ ‘ఉత్తమ సేవా అవార్డు’ను ఘనంగా అందుకున్నారు.
గాంధీ 157 వ జయంతి సందర్భంగా తెలంగాణ మదర్ ఆర్గనైజేషన్ రాష్ట్రం నుండి వివిధ రంగాలలో ఉత్తమ సేవా అందించిన 157 మంది ప్రముఖులను ఎంపిక చేసి, వారి సేవలను కొనియాడుతూ సన్మానించారు. ఈ
సన్మాన కార్యక్రమంలో
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క,
మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు.
.........
అవార్డు గ్రహీత సేవా విశేషాలు
* వీరు గతంలో పనిచేసిన 3 ప్రభుత్వ పాఠశాలల్లోను 100% పురోగతి సాధించడంతోపాటు విద్యార్థులకు చేర్పడంలో మరియు ప్రాథమిక విద్య బలోపేతానికి చేసిన కృషిని గుర్తించి ఈ పురస్కారాన్ని అందజేశారు.
* స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలను నిర్వహిస్తూ ఉత్తమ పద్ధతిగా సేవలు అందిస్తున్నారు.
* 2022-23, 2025-26 విద్యా సంవత్సరంలో BEST TLM SCHOOL గా ఎంపికయ్యారు.