BREAKING
గోదావరి భవనం నందు జాయింట్ కలెక్టర్ నిదియా దేవికి చాంబర్ ఆఫ్ కామర్సు నాయకులు వినతి పత్రం.. తిరుమలలో ఘనంగా నవరాత్రి బ్రహ్మోత్సవాలు.. పెద్దశేష వాహనంపై శ్రీ మలయప్ప కనువిందు రూ 25 లక్షలు తో పినపల్ల లో అభివృద్ధి పనులు తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌ను కలిసిన విజయ్ దేవరకొండ, రష్మిక.. సినిమాపై ప్రశంసల జల్లు! టీచర్స్ ఓటు పొందుటకు దరఖాస్తు చేసుకోవాలి ఓడలరేవు గ్రామానికి ఓఎన్జీసీ నిధులు విడుదల చేయాలి.. టీ, కాఫీలు ఎక్కువగా తాగుతున్నారా.. అయితే ఈ అనారోగ్య సమస్యలు తప్పవు! అందరూ సహకరిస్తేనేస్వచ్ఛత దసరా బాక్సాఫీస్ రేసులో 'రణబాలి' మరియు 'జైలర్ 2'.. పండగ విన్నర్ ఎవరో తేలేదిప్పుడే! ప్రజా సేవే లక్ష్యంగా ప్రజలకు సేవ చేయాలి :మానవత అధ్యక్షులు రామచంద్రారెడ్డి పిలుపు. రైతులకు సరిపడా ఎరువులు అందించాలి.* *పెంచిన ఎరువుల ధరలు తగ్గించాలి.* *ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో రంగాపురంలో రైతులు ధర్నా..* పార్టీ అవకాశం ఇస్తే పోటీకి సిద్ధం :కడియం జడ్పీటీసీ బరిలో ఆదిమూలం సాయిబాబా! అత్తిలిలో రూ.15.94 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం డయాలసిస్ కేంద్రం ప్రారంభం.. ఎనిమిది పంచాయతీరాజ్ రహదారులకు శంకుస్థాపన ధారూర్ ఎస్‌ఐగా సురేష్ బాధ్యతల స్వీకరణ ఇంట్లో వైభవంగా దసరా నవరాత్రి పూజలు.. ప్రత్యేక ఫోటోలు పంచుకున్న దిల్ రాజు భార్య తేజస్విని!

ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన

Select Suryaa Now
ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన

సూర్య - మానకొండూర్ :పేద ప్రజల ఆరోగ్య రక్షణే ధ్యేయంగా మానకొండూరు మండలం ఊటూరు గ్రామంలో సోమవారం నిర్వహించిన ఉచిత మెగా కంటి, దంత, జనరల్ వైద్య శిబిరానికి గ్రామీణుల నుంచి విశేష స్పందన లభించింది. ఊటూరు గ్రామానికి చెందిన రామగుండం లయన్స్ క్లబ్ పూర్వ జిల్లా గవర్నర్, సొసైటీ మాజీ చైర్మన్ ముద్దసాని ప్రదీప్ రెడ్డి, ముద్దసాని ప్రమోద్ రెడ్డి, లక్ష్మా రెడ్డి సోదరులు తమ తల్లి కీ.శే. ముద్దసాని వసుమతి దేవి స్మారకార్థం ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. కరీంనగర్, రామగుండం లయన్స్ క్లబ్స్ ఆధ్వర్యంలో, రేకుర్తి ఐ హాస్పిటల్, వెంకటాద్రి హాస్పిటల్ వారి సౌజన్యంతో జరిగిన ఈ శిబిరంలో మొత్తం 167 మందికి ఉచితంగా కంటి పరీక్షలు, దంత చికిత్సలు చేసి, అవసరమైన వారికి ఉచితంగా కళ్లద్దాలు, మందులను పంపిణీ చేశారు. వీరిలో తీవ్ర కంటి సమస్యలతో బాధపడుతూ ఆపరేషన్లు అవసరమైన 30 మందిని గుర్తించి, రేకుర్తి కంటి ఆసుపత్రి వాహనంలో ఉచిత శస్త్రచికిత్సల కోసం తరలించారు.ఈ కార్యక్రమంలో ప్రోగ్రామ్ చైర్మన్ లయన్ పెద్ది విద్యాసాగర్ పీఎంజేఎఫ్, పిఆర్సీ, ప్రోగ్రామ్ కో-చైర్మన్ లయన్ చీర్లవంచ సంపత్ కుమార్, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ లయన్ ముద్దసాని ప్రదీప్ రెడ్డి, లయన్ మ్యాడం శివకాంత్ పీఎంజేఎఫ్ పాల్గొన్నారు. అలాగే కరీంనగర్ లయన్స్ క్లబ్ అధ్యక్షులు లయన్ బట్టు వినోద్ ఎంజేఎఫ్, కార్యదర్శి లయన్ మేతుకు కృష్ణ చైతన్య ఎంజేఎఫ్, కోశాధికారి లయన్ టి. కార్తీక్, మరియు రామగుండం లయన్స్ క్లబ్ అధ్యక్షులు లయన్ బంక్క కళావతి, కార్యదర్శి లయన్ కాజంపురం జయప్రద, కోశాధికారి లయన్ వడ్లకొండ ఉమారాణి తదితరులు పాల్గొని శిబిరాన్ని విజయవంతం చేశారు..