ఉచిత పశు వైద్య శిబిరాన్ని.. సద్వినియోగం చేసుకోవాలి
- 20 పశువులకు సుడి పరీక్షలు, 5 పశువులకు కృత్రిమ గర్భధారణ
షాబాద్ మండల పరిధిలోని హైతాబాద్ గ్రామ పంచాయతీ పరిధిలోని అంకుగూడ గ్రామంలో రాష్ట్ర పశుఘన అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఉచిత పశు వైద్య శిబిరాన్ని నిర్వహించారు. బుధవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో రేగడిదోస్వాడ పశు వైద్యాధికారి డాక్టర్ జ్యోత్స్న ఆధ్వర్యంలో పశువులకు వైద్య పరీక్షలు నిర్వహించి, పశుపోషకులకు పలు సూచనలు అందించారు. శిబిరంలో మొత్తం 20 పశువులకు సుడి పరీక్షలు నిర్వహించగా, 5 పశువులకు కృత్రిమ గర్భధారణ చేశారు. పశువుల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి, వ్యాధుల నివారణ, పశు సంరక్షణ, పాల ఉత్పత్తి పెంపుపై పశుపోషకులకు అవగాహన కల్పించారు. పశువులకు సకాలంలో వైద్య పరీక్షలు చేయించడంతో పాటు, వ్యాధుల నివారణకు ముందస్తు జాగ్రత్తలు పాటించాలని వైద్య సిబ్బంది సూచించారు.ప్రభుత్వం అందిస్తున్న ఉచిత పశు వైద్య సేవలను పశుపోషకులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో హైతాబాద్ గ్రామ సర్పంచ్ శాంతమ్మ యాదయ్య, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, పశుపోషకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
షాబాద్, మేజర్ న్యూస్ : (అక్టోబర్ 07)