BREAKING
కొండేపి అభివృద్ధికి జోడు అడుగులు డోల బాల వీరాంజనేయ స్వామి దామచర్ల సత్య హెచ్-1బీ వ్యవస్థలో భారీ మోసాలు జరుగుతున్నాయి.. జలజీవన్ మిషన్ 90 లక్షల నిధులతో త్రాగునీటి పథకానికి శంకుస్థాపన చేసిన.......... ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ గంగమ్మ ఒడికి చేరిన అతి భారీ ఏకదంత వినాయకుడు తంబళ్లపల్లె సీనియర్ సిటిజన్స్ కమిటీ ఎన్నిక ఏకగ్రీవం మిట్స్‌ వర్సిటీలో ఘనంగా భారత వైమానిక దళ దినోత్సవం రోడ్డుప్రమాదంలో ఒకరు మృతి, ఇద్దరికీ గాయాలు ఈనెల 12 నుండి బోయకొండలో శరన్నవరాత్రి ఉత్సవాలు టమోటా మార్కెట్ అభివృద్ధిలో కీలక సంస్కరణలు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు పూర్తిస్థాయిలో సన్నద్ధత గ్యార్మీ మహోత్సవం(జెండా పండుగ) కార్యక్రమంలో పాల్గొన్న....... ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ గుజరాత్‌లో సబర్మతి రైల్వే స్టేషన్ పునర్నిర్మాణం తుది దశకు: 85 శాతానికి పైగా పనులు పూర్తి. మునగ ప్లాంటేషన్ పనులను పరిశీలించిన జెడ్పీ సీఈఓ బిసి సంక్షేమ గురుకుల పాఠశాలకు ఐదు సీలింగ్ ఫ్యాన్లు వితరణ పరిహారం ఇవ్వకుండా పనులెలా చేస్తారు?

అక్టోబర్ 11 నుండి శతచండీ మహోరుద్ర యాగ మహోత్సవాలు

Select Suryaa Now
అక్టోబర్ 11 నుండి శతచండీ మహోరుద్ర యాగ మహోత్సవాలు

విజయనగరం, సూర్య: పట్టణంలోని మయూరి జంక్షన్ వద్ద సంతకాల వంతెన దగ్గర అక్టోబర్ 11-10-2026 నుండి 21-10-2026 వరకు శ్రీ శతచండీ మహోరుద్ర యాగ మహోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు రుత్వికులు బ్రహ్మశ్రీ కృష్ణశర్మ, ధర్మారావు లు తెలిపారు. గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ 11 రోజులు పాటు భక్తి శ్రద్దలతో అనేక మంది రుత్వికులచే చండిహోమం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ సందర్బంగా ఆహ్వాన పత్రికలను విడుదల చేశారు.
ఈ యాగ మహోత్సవాలు ప్రతిరోజూ ఉదయం 8:00 గంటల నుండి మధ్యాహ్నం 1:00 గంట వరకు, మరియు సాయంత్రం 4:00 గంటల నుండి రాత్రి 8:30 గంటల వరకు జరుగుతాయని చెప్పారు. ఈ యాగంలో భాగంగా ప్రతిరోజూ ఉదయం 8:30 గంటల నుండి మధ్యాహ్నం 12:00 గంటల వరకు సువాసినులచే "సామూహిక కోటి కుంకుమార్చన" ఉచితంగా నిర్వహించబడుతుందని అన్నారు. యాగ మహోత్సవ పర్యవేక్షకుడు పెంటపాటి కామరాజు మాట్లాడుతూ ప్రతిరోజూ భక్తులకు ప్రసాద వితరణ ఉంటుందని అన్నారు. 22 వ తేదీన  మహా అన్నసంతర్పణ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భక్తులందరూ ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని నిర్వాహకులు బత్తుల పట్టాభిరామారావు, బత్తుల పైడిరాజు, బత్తుల సత్యనారాయణ, బత్తుల బుజ్జి నరససింహులు, మాచర్ల లక్ష్మీనారాయణ గార్లు కోరారు.