BREAKING
కొండేపి అభివృద్ధికి జోడు అడుగులు డోల బాల వీరాంజనేయ స్వామి దామచర్ల సత్య హెచ్-1బీ వ్యవస్థలో భారీ మోసాలు జరుగుతున్నాయి.. జలజీవన్ మిషన్ 90 లక్షల నిధులతో త్రాగునీటి పథకానికి శంకుస్థాపన చేసిన.......... ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ గంగమ్మ ఒడికి చేరిన అతి భారీ ఏకదంత వినాయకుడు తంబళ్లపల్లె సీనియర్ సిటిజన్స్ కమిటీ ఎన్నిక ఏకగ్రీవం మిట్స్‌ వర్సిటీలో ఘనంగా భారత వైమానిక దళ దినోత్సవం రోడ్డుప్రమాదంలో ఒకరు మృతి, ఇద్దరికీ గాయాలు ఈనెల 12 నుండి బోయకొండలో శరన్నవరాత్రి ఉత్సవాలు టమోటా మార్కెట్ అభివృద్ధిలో కీలక సంస్కరణలు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు పూర్తిస్థాయిలో సన్నద్ధత గ్యార్మీ మహోత్సవం(జెండా పండుగ) కార్యక్రమంలో పాల్గొన్న....... ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ గుజరాత్‌లో సబర్మతి రైల్వే స్టేషన్ పునర్నిర్మాణం తుది దశకు: 85 శాతానికి పైగా పనులు పూర్తి. మునగ ప్లాంటేషన్ పనులను పరిశీలించిన జెడ్పీ సీఈఓ బిసి సంక్షేమ గురుకుల పాఠశాలకు ఐదు సీలింగ్ ఫ్యాన్లు వితరణ పరిహారం ఇవ్వకుండా పనులెలా చేస్తారు?

సాగునీరు అందించాలి

Select Suryaa Now
సాగునీరు అందించాలి

బాడంగి, సూర్య: రైతులకు సాగునీరు అందేలా చర్యలు చేపట్టాలని జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు మరిపి విద్యాసాగర్‌ డిమాండ్‌ చేశారు. గురువారం భీమవరం గ్రామంలో మండల అధ్యక్షుడు లచ్చిపతుల రామానందం ఆధ్వర్యంలో నిర్వహించిన కాంగ్రెస్‌ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్థులు, రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
భోజరాంపురం–అప్పలనాయుడు చెరువు, భోజరాంపురం–కైకాల చెరువు కాలువల్లో పేరుకుపోయిన మేటలను తొలగించాలని, పిడుగుపాటుకు మృతి చెందిన లచ్చిపతుల సింహాచలం కుటుంబానికి నష్టపరిహారం అందించాలని కోరారు. గ్రామంలోని విద్యుత్‌ సమస్యలను కూడా పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. గ్రామస్థులు తెలిపిన సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని విద్యాసాగర్‌ తెలిపారు. అనంతరం పలువురు గ్రామస్థులకు కాంగ్రెస్‌ పార్టీ కండువాలు కప్పి విద్యాసాగర్‌ పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో మువ్వల శ్రీనివాసరావుతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.