తెలంగాణ రక్షణ సేన జిల్లా అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్‌కు ఘన సన్మానం.
సూర్య కరీంనగర్ ప్రతినిధి:
దళిత సేన జిల్లా నాయకులు చంటి శ్రీనివాస్ ఆధ్వర్యంలో. కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ కి మహిళ విభాగం జిల్లా అధ్యక్షురాలు పిన్నింటి సంగీత రెడ్డి కి, తెలంగాణ రక్షణ సేన నగర పార్టీ అధ్యక్షుడు రంగరవేణి లక్ష్మణ్ లను తెలంగాణ రక్షణ సేన జిల్లా దళిత సేన నాయకులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొని గుంజపడుగు హరిప్రసాద్ కు శుభాకాంక్షలు తెలిపారు. సందర్భంగా చంటి శ్రీనివాస్ మాట్లాడుతూ, తెలంగాణ రక్షణ సేన బలోపేతానికి గుంజపడుగు హరిప్రసాద్ చేస్తున్నకృషిఅభినందనీయమని అన్నారు. ముఖ్యంగా దళితులు, బడుగు బలహీన వర్గాల సమస్యల పరిష్కారం కోసం పార్టీ మరింత బలమైన పోరాటాలు నిర్వహించాలని ఆకాంక్షించారు.జిల్లాలో పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేస్తామని, దళితులు, బడుగు బలహీన వర్గాల హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం పనిచేస్తామని చెప్పారు. సామాజిక న్యాయం, సమాన అవకాశాలు, అణగారిన వర్గాల హక్కుల కోసం తెలంగాణ రక్షణ సేన నిరంతరం ప్రజల పక్షాన నిలుస్తుందని ఆయన స్పష్టం చేశారు. పార్టీ కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో తెలంగాణ రక్షణ సేన నాయకులు మ్యాకల తిరుపతి, శ్రీరాముల రమేష్, , లింగంపల్లి శ్రీనివాస్, ఉల్లేందుల నరేష్, లంక మనోజ్ తదితరులు పాల్గొన్నారు.